Others

అలాగైనా సరే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిన్నమైన పాత్రలు చేసి నటీనటులుగా నిరూపించేందుకు కొందరు స్టార్‌లు గట్టి ప్రయత్నాలే చేస్తుంటారు. మరికొందరేమో.. తనకు వచ్చిన ఈ ఇమేజ్ చాలు, దాన్ని పాడుచేసుకోకుండా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంటారు. లేటెస్టుగా భిన్నమైన పాత్రలు చేయడానికి సిద్ధమైంది గ్లామర్ భామ రాశిఖన్నా. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజులకే తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ అమ్మడు, ఓ సినిమాలో నెగెటివ్ రోల్ చేయడానికి సిద్ధం అయింది? ఆ వివరాల్లోకి వెళితే.. మలయాళంలో ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో రూపొందే ఓ సినిమాలో రాశి నెగెటివ్ పాత్రలో నటించేందుకు ఓకె చెప్పిందట. ఈ సినిమాలో హీరోగా మమ్ముట్టి నట్టిస్తున్నాడు. తనలో గ్లామర్ కోణమే కాదు మరో కోణం కూడా ఉందని నిరూపించే పనిలో పడింది ఈ గ్లామర్ భామ. ఈ సినిమాలో మమ్ముట్టితోపాటు తెలుగు హీరో శ్రీకాంత్, హీరో విశాల్, హన్సికలు కూడా ఉన్నారట. మరి గ్లామర్‌తో కట్టిపడేసిన ఈ చిన్నది నెగెటివ్ రోల్‌లో ఎలా చేస్తుందో చూడాలి!