Others

అలా.. మొదలైంది (శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగపతి పిక్చర్స్ సంస్థలో పనిచేసే నటీనటులను, సాంకేతిక నిపుణులను నిర్మాత రాజేంద్రప్రసాద్ తన స్వంత కుటుంబ సభ్యులలాగా చూసుకునేవారని పరిశ్రమలో నానుడి. ప్రారంభ చిత్రం అన్నపూర్ణ (1960) నుంచి వరుసగా జమున, సావిత్రి, బి.సరోజాదేవి, భానుమతి, కృష్ణకుమారిలు ఆ సంస్థ నిర్మించిన చిత్రాలలో కథానాయికలుగా నటించారు. ‘ఆస్తిపరులు’ చిత్రంలో జయలలిత నాయిక పాత్ర పోషించింది. ఆ సంస్థలో జయలలితకు ఇది మొదటి చిత్రం. అప్పటికే తెలుగుతోపాటు తమిళంలో కూడా అగ్రశ్రేణి నటిగా కొన్ని విజయవంతమైన చిత్రాలలో నటించింది. హీరోయిన్‌లను గౌరవించే సంస్కారంగల జగపతి సంస్థ జయలలిత తమ బ్యానర్‌లో నటిస్తున్న మొదటి చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం ఒక వేడుకగా జరుపుకొన్నారు. వేడుక అంటే మాటలతో చెప్పేవిధంగా కాకుండా యూనిట్ సభ్యులంతా కలిసి ఒక పండగ వాతావణాన్ని సృష్టించే విధంగా సంబరం జరుపుకొన్నారు. కళాకారులకైనా, సాంకేతిక నిపుణులకైనా ఎన్ని చిత్రాలకు పనిచేశాము, ఎంతెంత పారితోషికం ముట్టింది అనే ఆలోచనకంటే ఆ షూటింగ్ సందర్భంగా జరుపుకొన్న సంబరాలే కలకాలం గుర్తుంటాయి. ఈ చిత్రం తర్వాత జయలలిత జగపతి సంస్థ నిర్మించిన ఆరవ చిత్రం ‘అదృష్టవంతులు’ చిత్రంలో కూడా నాయికగా అక్కినేని సరసన నటించింది. దర్శకుడు వి.మధుసూదన్‌రావు జగపతి సంస్థకు దర్శకత్వం వహించిన ఆఖరి చిత్రం. ఒక దర్శకుడు ఒకే సంస్థకు ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించడం ఒక రికార్డు కాగా, గతంలో ఆదుర్తి సుబ్బారావు అన్నపూర్ణా సంస్థ నిర్మించిన చిత్రాలకు తెలుగు, తమిళ భాషలలో 12 చిత్రాలకు (3 తమిళం, 9 తెలుగు) దర్శకత్వం వహించి ఒక రికార్డు సృష్టించారు. ఈ 12 చిత్రాలకు హీరో అక్కినేని కావటం విశేషం. ఆదుర్తి సుబ్బారావు శిష్యుడు వి.మధుసూదనరావు ఒకే సంస్థకు ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించి గురువు తగ్గ శిష్యుడు అనిపించుకొన్నాడు. ఈ ఆరు చిత్రాలలో 5 చిత్రాలలో హీరో అక్కినేని కావటం మరో విశేషం. ఇలా దర్శకులు క్రమశిక్షణ పాటిస్తూ నిర్మాతకు తలలో నాలుకలా వ్యవహరించటంవల్లనే నిర్మాత, దర్శకులు ఒక కుటుంబంలోని వ్యక్తులుగా రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవటం మన తెలుగు స్వర్ణయుగ కాలంలోనే జరగటం విశేషం.

-పర్చా శరత్‌కుమార్ 9849601717