Others

ఎప్పుడొస్తుందో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టైమ్ వస్తే ఏదీ ఆగదంటారు మనోళ్లు. నిజమే, కోరుకున్నది దక్కాలంటే టైం రావాలి మరి. ఈ మాటే నిజమంటోంది అందమైన అల్లరి పిల్ల తేజస్వి ఇండస్ట్రీకి వచ్చి చాలాకాలమే అయినా తనకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదన్న బాధ మాత్రం తేజస్వికి ఉందట. వర్మ చిత్రం ‘ఐస్‌క్రీమ్’నై వెరీ నైస్‌గాళ్‌గా మురిపించిన తేజస్వి, కేరింతలోనూ తన స్థాయి నటనే ప్రదర్శించింది. అరమరికల్లేని అందమైన పక్కింటి అల్లరి పిల్లలా కనిపించే తేజస్వి -గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నా గుర్తింపు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయిందట. విడుదలకు సిద్ధమైన ‘బాబు బాగా బిజీ’లో మరింత క్రేజీగా కనిపిస్తానంటున్న తేజస్వి -ఈ సినిమాతోనైనా మంచి గుర్తింపు వస్తుందన్న ఆశతో ఉంది. ‘ఎన్ని సినిమాలు చేసినా -ఒక మంచి సినిమా పడాలి. అందుకు టైమ్ రావాలి. అదొచ్చినపుడు మనల్ని ఎవరూ ఆపలేరు. దక్కాల్సిన స్టార్ స్టేటస్ దక్కకుండా పోదు. అప్పటి వరకూ ఓపిక పట్టడమే అసలు టాలెంట్’ అంటోంది తేజస్వి. అందరూ చెప్పేదే అయినా, ఆమె చెప్పేదాంట్లోనూ పాయింట్ ఉన్నట్టే. ఆ టైమెప్పుడో.. రావాల్సిన టైమ్‌కే తెలియాలి మరి.