Others

వనీవన న్యాయం.. ఉత్తమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా చరిత్రలో ప్రతీ విభాగంలో ఆరితేరిన దిగ్గజాలు ఉన్నారు. అది దర్శకత్వం కావొచ్చు, నిర్మాణం, సంగీతం, సాహిత్యం, నేపథ్యగానం, నటన.. ఏదైనా కావొచ్చు. ఒకరికంటే ఒకరు తక్కువని ఎవరినీ చెప్పలేం. కానీ ఈగో ఫీలింగ్స్‌తో ఒకర్నొకరు బాధ పెట్టుకుంటున్నారు. ఎవరు ఏ రంగంలోవున్నా, ఆ శక్తి ఎంతో ప్రయత్నం, ఎన్నో కష్టాల తర్వాత వచ్చిన ఫలితాలే. ఇక పెద్ద బడ్జెట్‌తో సినిమాలు తీసే నిర్మాతలు వ్యాపారకోణంలోనే తగిన దర్శకుడు, సంగీత దర్శకుడు, గీత రచయిత, నటీనటులను ఎన్నుకుంటాడు. కథకు తగినట్టు మాటలు రాయించుకుంటాడు. ఏ ప్రాంతంలో షూటింగ్ జరపాలో దర్శకుడితో చర్చిస్తాడు. సినిమాలోని పాటలూ తగిన విధంగా రాయించుకుంటారు. ఇక ముఖ్యమయినది సంగీతం. సినిమా నిర్మాణంలో సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యత. అందుకే మంచి సంగీతం కోసం తాపత్రయపడుతుంటారు. అంటే -ఒక సినిమా సక్సెస్ కావాలంటే దానికి సంబంధించి పనిచేసే దర్శకుడు, సంగీత దర్శకుడు, కథా రచయిత, గేయ రచయిత, నేపథ్య గాయకులు, నటీనటులు, టెక్నీషియన్లు అంతా కలిసి ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తేనే హిట్టు అందేది. నిర్మాతకు పెట్టుబడిపోను ఒకింత లాభం వచ్చేది. వీరంతా ఒకరికొరకు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో ఉంటేనే ఇదంతా సాధ్యం.
ఈమధ్య చిన్న చిన్న పొరపాట్లు, ఈగోలతో ఒకరికొకరు సహకరించుకోక పోవడంవల్ల, అనుచిత వ్యాఖ్యలు చేసుకోవడం వల్ల తెలుగు సినిమా పరిశ్రమకు చెడ్డపేరు వస్తోంది. జాతీయ వేదికలపై తెలుగు పరిశ్రమ తలదించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
నాలుగు దశాబ్దాలుగా తన స్వరాలతో ఉర్రూతలూగించిన సంగీత సమ్రాట్ ఇళయరాజా, నేపథ్య గాయకుడిగా గొప్ప పేరున్న ఎస్పీ బాలు మధ్య జనానికి తెలీని ఎలాంటి స్పర్థలు వచ్చాయో తెలీదుగానీ, ఇద్దరి మధ్య బహిర్గతమైన వివాదంతో తెలుగు పరిశ్రమ చిన్నబోయినట్టయ్యింది. తాను సంగీత దర్శకత్వం వహించిన పాటల్ని కమర్షియల్ విభావరిల్లో బాలు పాడకూడదని, పాడితే పేటెంట్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటానని లీగల్ నోటీసు పంపడం బాధాకరమైన విషయం. ఈ పరిణామంతో వాళ్లమధ్య సాన్నిహిత్యం దెబ్బతిన్నట్టే.
ఇదిలావుంటే, మంచి సంగీత దర్శకుడిగా సినిమా పరిశ్రమలో పేరు తెచ్చుకున్న ఎంఎం కీరవాణి -పలువురు దర్శకులపై చేసిన ట్వీట్లు పరిశ్రమకే అవమానం. దర్శకుల మనస్సు గాయపర్చేలా ఆయన చేసిన ట్వీట్లు వ్యక్తిగతమే అయినా, పరిశ్రమ గౌరవాన్ని దిగజార్చినట్టే అయ్యింది. బాలు- ఇళయరాజాల మాదిరిగానే పాపం కీరవాణి కూడ ఎక్కడో, ఏదో సందర్భంలో బాధపడినట్టుంది. అందుకే ఇలా పబ్లిక్‌గా ట్వీట్లకు దిగడం చిత్రసీమలోని చాలామంది దర్శకులని ఆలోచనలో పడేసింది. కొంతమంది దర్శకులకు బుద్ధిబలం లేదని, అలాంటివారితో పని చేయాల్సి వచ్చిందని కీరవాణి లేపిన దుమారం ఆయన స్థాయికి తగనది మాత్రం కాదు.
ఆ అగ్నికి మరికొంత ఆజ్యంపోస్తూ, వెటకార ధ్వనితో మళ్లీ మళ్లీ చేసిన ట్వీట్లు తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్ర నుంచి ఎప్పటికీ చెరిగిపోవు. ‘మాలాంటివాళ్ళు తప్పులు చేస్తే మీలాంటివాళ్ళు సరిదిద్దాలి’ (దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు సమాధానంగా), ‘చిత్ర పరిశ్రమలో అందరూ మేధావులే, సృజనశీలురే నేను తప్ప’, ‘కొంతమంది దర్శకులకు బుద్ధిబలం లేదు’, ‘వేటూరి మరణం, సిరివెనె్నల సీతారామశాస్ర్తీ అనారోగ్యం కారణంగా తెలుగు సినిమా సాహిత్యం పడకేసింది’లాంటి మరికొన్ని ట్వీట్లు ఈగోతో చేసిన వెటకారమా? ఆవేదనతోనేనా అన్నది స్పష్టంకాకపోవడం.. ఎంతమాత్రం మంచి పరిణామం కాదు.
కీరవాణి ‘చిత్రసీమలో ఉన్న మేమందరం విద్యార్థులం’ అంటూనే, ‘దర్శకులంతా మేధావులు, వినయశీలురు. నేను మాత్రమే బుద్ధిలేనివాడిని’ అనడం వెనుక మతలబేమిటి? ఈ మాటలు వ్యంగ్యంగా అన్నట్టా? లేక మరో ఆలోచనతో చేసినవా? తనకు తానే ‘దర్శకులతో పనిచేయడానికి పడిచస్తానని’ అనడమేమిటి? ‘డ్యూయెట్లు, ఐటెమ్ పాటలు ఈమధ్య కథానాయకులు, గాయకులు, దర్శకులు ఎవరికివారు రాసేసుకుంటున్నారని, ఆ విషయాన్ని అనంత శ్రీరామ్ తనతో చెప్పాడని’ అనడంలో పరమార్థం కేవలం సాహిత్యం తెలిసిన వారయితేనే పాటలు మంచిగా రాస్తారనా? లేక సాహిత్యం తెలిసినవారే పాటలు రాయాలనా? గొప్పకోసం అందరూ పాటలు ఇష్టం వచ్చినట్లు రాసుకుని పాడుకుంటున్నారనా? కీరవాణి మనస్సు ఎందుకు బాధపడిందో కాని అంతర్మథనానికి గురైనట్టు ట్వీట్లను చూస్తే అర్థమవుతుంది. ఏదేమైనా సాహిత్యం గొప్పది. ఇపుడు వస్తున్న సినిమాల్లో ట్రెండ్‌ను బట్టి అందరూ పాటలు రాసేస్తున్నారు. ఒకవేళ కీరవాణి తండ్రికాలంలో, వేటూరిగారి కాలంలో అదేవిధంగా సీతారామశాస్ర్తీ గారు రాసిన విధంగా పాటల్లో సాహిత్యం ఉండటం లేదనా? జనరేషన్ అడ్వాన్స్ అవడం చేత ఏరకమైన మెసేజీలను, పాటలను ప్రేక్షకులు ఆస్వాదిస్తారో అలాంటివే ఖచ్చితంగా ఉండాలి. కీరవాణికి సాహిత్యంమీద వున్న మక్కువ, మమకారంతోనే ఇలా స్పందించినట్టున్నారు. ఏరకంగా స్పందించినా కూడా బాలుగారు- ఇళయరాజా మధ్యన, కీరవాణి -దర్శకుల మధ్య ఈ సందర్భం తరువాత ఎంతోకొంత మనస్పర్థలు చోటుచేసుకున్నట్టే లెక్క.
కానీ చిత్రసీమలో దర్శకుడి నుంచి సంగీత దర్శకుడు, రచయితలు, నటీనటులు, టెక్నీషియన్లు అందరూ కలిసి పనిచేస్తే ఏ సినిమా అయినా సక్సెస్ అవుతుంది. నిర్మాత అప్పులుపాలు కాకుండా బయటపడగలుగుతాడు. ***
అడవిలోని చెట్లు -వేటగాళ్ల బారిన పడకుండా రక్షణ కల్పిస్తాయి. అడవిలోకి మనుషులు ప్రవేశించి చెట్లను నరికేయకుండా -జంతువులు రక్షణ కల్పిస్తుంటాయి. దీనినే ‘వనీవన న్యాయం’ అంటాం. అలాగే చిత్రసీమలో పనిచేసే వారంతా తప్పనిసరిగా ‘వనీవన న్యాయాన్ని’ పాటిస్తే -చిత్రసీమలో ఎవరినీ ఎవరూ బాధపెట్టినవాళ్ళు కాలేరు. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో కలిసి పనిచేస్తే ప్రతి చిత్రం సక్సెస్ అవుతుంది. దాని ఫలితం అందరికీ అందుతుంది. అంతేకానీ, వ్యక్తిగతమంటూ ఒకరిపై ఒకరు దూషణలకు పాల్పడితే -పరిశ్రమకు ఇప్పటి వరకూ దక్కిన గౌరవానికే భంగం. జాతీయ వేదికలపై మనల్ని మనమే చిన్నబుచ్చుకోవడం అవుతుంది. పెద్దలు ఆలోచించాలి.

-శ్రీనివాస్ పర్వతాల