Others

గ్లామర్ పబ్లిసిటీ (శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ వ్యాపార సంస్థకైనా ప్రారంభంలో పబ్లిసిటీ అత్యంత అవసరం. ఈ సూత్రంతోనే ఆయా వ్యాపార సంస్థల ప్రారంభోత్సవ కార్యక్రమాలను వారి వారి హోదా, పలుకుబడి, ఆర్థిక స్థితినిబట్టి జరిపించుకుంటూ ఉంటారు. కొందరు రాజకీయ అవసరాల నిమిత్తం ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు ఇకా పలుకుబడి కలిగిన మంత్రులతోనూ ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం చూస్తూంటాం. మరికొందరు పోలీస్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కార్యక్రమాలకు ఆహ్వానించడమూ ఇప్పుడూ కనిపిస్తోన్న దృశ్యమే. అనుకోని పరిస్థితుల్లో ఏమైనా పొరబాట్లు జరిగినా అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయన్న ఆశా ఇలాంటి ఆహ్వానాలకు కారణం కావొచ్చు. సినిమా కూడా వ్యాపారమే కనుక, థియేటర్ల ప్రారంభోత్సవ విషయంలోనూ పబ్లిసిటీని ఆశించటం సహజం. సినిమా రంగానికి చెందిన కుటుంబాలు కొన్ని థియేటర్లను నిర్వహించటం ఎప్పటినుంచో ఉన్నదే. ఆయా కుటుంబాలకు పంపిణీ రంగం నుంచీ సహాయ సహకారాలు పుష్కలంగా లభిస్తుంటాయి. దీంతో మంచి చిత్రాల ప్రదర్శనకు అవకాశం లభిస్తుంది. విజయవంతమైన చిత్రాల ప్రదర్శనశాలగా ప్రేక్షకులలో ఒక ఇమేజ్ ఏర్పడుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న చిత్రం అలాంటి అంశానికి సంబంధించినదే. చాలా ఏళ్ల కిందట ఒంగోలులో బివిఎస్ బ్రదర్స్ నిర్వహణలో బివిఎస్ మహల్ నిర్మాణం జరిగింది. దాని ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు. థియేటర్ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న సినీ ప్రముఖులు గుమ్మడి వేంకటేశ్వర రావు, హీరో రంగనాథ్, దర్శకుడు గోపాలకృష్ణను ఈ చిత్రంలో చూడొచ్చు.

-పర్చా శరత్‌కుమార్ 9849601717