Others

నాకు నచ్చిన పాట- జయమ్ము నిశ్చయమ్మురా!..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శభాష్ రాముడు’ చిత్రంలో ఘంటసాల స్వరపరచిన శ్రీశ్రీ సాహిత్యంతో రూపుదిద్దుకున్న పాట ‘జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా’ పాట నాకెంతో ఇష్టం. ఈ పాటకు సంగీతం ప్రాణమైతే, విద్యార్థులకీ, పిల్లలకీ, పెద్దలకీ చక్కని సందేశాన్ని ఇచ్చే అమోఘమైన సాహిత్యంతో శ్రీశ్రీ ఈ పాటను కలకాలం గుర్తుండిపోయేలా, మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేశారు. ఏ పని మొదలుపెట్టినా జయం తప్పదని, జంకు గొంకు వీడి ముందుకు ధైర్యంగా సాగాలని వెన్నుతట్టాడు శ్రీశ్రీ. ఏనాటికైనా స్వార్థం నశించి, సత్యమే జయిస్తుందని, సుఖాలు దక్కాలంటే కష్టాలకు ఓర్చుకోవాలని సందేశాన్నిచ్చారు. విద్యార్థులంతా విజ్ఞానం సాధించాలని, సంకుచిత భావాలను విడనాడి, విశాల దృష్టితో ఉండాలని, పెద్దలను గౌరవించాలని వారికి నీతిని ప్రమోధించారు. సోమరితనం మాని ఎలాంటి కష్టాలకైనా ఓర్చుకోవాలని, పవిత్రమైన ఆశయాలను మరుకూడదని ప్రబోధించారు. బీదసాదలను ఆదరించడం ముఖ్యమని తెలుసుకోవాలి. గాడాంధకారానికి భయపడక, వెలుగు చూపి ముందుకు సాగాలని, నిరాశలో మునగవద్దని, పరాభవమెదురైతే పారిపోవద్దని, జయించేవరకూ పట్టుదలతో పోరాడాలని, స్వతంత్ర యోధుడనే పేరు నిలబెట్టాలని ప్రబోధించారు. ప్రతి ఒక్కరూ నేర్చుకోవడమే గాక, తప్పనిసరిగా తమ పిల్లలకూ నేర్పాలి. టీచర్లు పిల్లలకూ నేర్పాలి.

-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం