Others

కనుమరుగైన హాస్యం.. శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా ప్రేక్షకులు అభిమానించిన నాయికా నాయకులు వున్నారు. వీరిని ప్రేమతో ‘హిట్ పెయిర్’ అని కూడా అనేవారు. అలాగే వారు అభిమానించిన హాస్యజంట కూడా వున్నారు. వారిని కామెడీ పెయిర్ అనేవారు. అలాంటి చిత్రాలలో హాస్యం ప్రధాన కథలో అంతర్భాగంగా వుంటూ సన్నివేశాలకు అనుగుణంగా కడుపుబ్బ నవ్వించేది. కామెడీ జంటలకు సన్నివేశాలకు తగ్గట్లు యుగళగీతాలు కూడా వుండేవి. అవి గ్రామీణ ప్రాంతాలలో సైతం పామర జనాన్ని విపరీతంగా ఆకర్షించేవి. కామెడీ జంటలుగా రేలంగి- గిరిజ, పద్మనాభం- గీతాంజలి, రాజ్‌బాబు- రమాప్రభలు పలు చిత్రాల ద్వారా తెలుగువారి అభిమానాన్ని చూరగొన్నారు. రోజులు మారాయి.. నేటి చిత్రాలలో హాస్యం మచ్చుకైనా కానరావటంలేదు. కథకు సంబంధం లేని సన్నివేశాలు, ద్వంద్వార్థపు సంభాషణలతో జుగుప్సాకరమైన చిత్రాలను చూడవలసిన స్థితి దాపురించింది. రాజ్‌బాబు- రమాప్రభ ఫోటో చూస్తుంటే పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి కదూ. అందుకే స్వర్ణయుగపు తెలుగు చిత్రాలను వివిధ చానల్స్‌లో చూస్తూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. రాబోయే కాలంలోనైనా హాస్య పాత్రలతో హాస్యం ప్రధానాంశంగా తెలుగు చిత్రాలు నిర్మించబడతాయనే ఆశతో మాత్రం తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. వారి ఆశలు ఫలించేది ఎప్పుడో కాలమే సమాధానం చెప్పాలి. అప్పటి ఓ సినిమా ఫంక్షన్‌లో ఆ కామెడీ పెయర్ ఇలా..

-పర్చా శరత్‌కుమార్ 9849601717