Others

పోటీ మొదలైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయస్థాయిలో తెలుగు సినిమాకు గౌరవం పెరుగుతూ వస్తుంది. ఏటా ప్రాంతీయ భాషా విభాగంలో ఏదోక సినిమా సందడి చేయడం మామూలు విషయమే! కాని ‘బాహుబలి’కి జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం రావడంతో తెలుగు సినిమాకు జాతీయ అవార్డులపై గౌరవం, ఆశలు పెరిగాయనే చెప్పాలి. గత ఏడాదికి ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ‘పెళ్ళిచూపులు’.. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ‘శతమానం భవతి’ ఎంపిక కావడంతో తెలుగు సినిమా ఖ్యాతి రోజురోజుకీ పెరుగుతోంది. పరభాషా పరిశ్రమలు చూపుకూడా తెలుగు సినిమాపై పడుతోంది.
ఏడాదికి రెండేసి చిత్రాలు జాతీయస్థాయిలో ఎంపికకావడంతో పరిశ్రమలో కొత్త ఊపు కనిపిస్తోంది. ‘బాహుబలి’.. ‘కంచె’ ఒక ఏడాది సందడి చేస్తే ‘పెళ్ళిచూపులు’, ‘శతమానం భవతి’ ఈ యేడాది జోష్‌ని నింపాయి. ఈ విజయాల వెనుక ప్రశంసలు.. విమర్శలు ఎన్నొచ్చినా వాటిని ప్రొడక్షన్ హౌస్‌లు తేలిగ్గానే తీసుకుంటున్నాయి. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి జాతీయస్థాయిలో ప్రాంతీయ విభాగంలో ఎన్ని సినిమాలు సందడి చేసినా పూర్తిస్థాయి జాతీయ చిత్రంగా ఏ చిత్రం గుర్తించబడలేదనే అసహనం బాహుబలితో తీరిపోయింది. తెలుగోడు కూడా ఆ స్థాయి చిత్రాన్ని తీయగలడని నిరూపించబడినది.
ఈ ఏడాది కె విశ్వనాథ్‌ని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్‌కి ఎంపిక చేయడం పట్ల పరిశ్రమలో ఆనందం నెలకొంది. అవార్డుపట్ల గౌరవం.. నమ్మకం పెరిగిందన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఈ జాతీయ పురస్కారం తెలుగు పరిశ్రమకు కొత్తకాకపోయినా తెలుగు పరిశ్రమ ఉన్నతికి కొలమానంగా చెప్పాలి. కె విశ్వనాథ్ చిత్రాల్లో చాలా చిత్రాలు జాతీయ ప్రాంతీయ చిత్రాల విభాగంలో ఎంపిక కావడం తెలిసిందే! రాజవౌళి ప్రస్థానంలో కూడా మగధీర, ఈగ, బాహుబలి.. వరుసగా జాతీయస్థాయిలో తెలుగు ముద్రను వివిధ కేటగిరీలలో వేయడంతో ఇక ప్రతి యేడాది తెలుగు సినిమా జాతీయస్థాయిలో ఉండాలనే ఆకాంక్ష పెరుగుతుంది. సాధించిన విజయం చూసిన తరువాత -జాతీయస్థాయిలో ఈసారి రాజవౌళి ఉత్తమ దర్శకుడిగా ఎంపిక కావడం ఖాయమన్న నమ్మకం కలుగుతోంది. అంతేకాదు, వివిధ కేటగిరీల్లో (విజువల్ ఎఫెక్ట్స్, కెమెరా) జాతీయ అవార్డులు కొల్లగొడుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఇదే నిజమైతే ఒక తెలుగు సినిమా రెండు పార్టులు జాతీయస్థాయిలో అవార్డులు గెలుచుకోవడం రికార్డే అవుతుంది. అది తెలుగు సినిమాకు చెరగని ఖ్యాతిగానూ మిగులుతుంది.
జాతీయస్థాయిలో తెలుగు సినిమాకు అన్యాయం జరుగుతుందని చాలామంది అభిప్రాయపడేవారు. జాతీయస్థాయి అవార్డును గెలుచుకునే కథ, కథనాలు ఉండటం లేదనే విమర్శలూ వెల్లువెత్తేవి. ఇప్పుడు ఇలాంటి వాటికి వరస జాతీయ అవార్డులు బ్రేక్ వేస్తున్నాయి. వరస జంట చిత్రాల అవార్డుల కేటగిరిలో ఈసారి ‘బాహుబలి-2, ఘాజీలు’ వచ్చే ఏడాది విన్నర్‌గా నిలుస్తాయని ప్రేక్షకులు అంచనా. ఇదే నిజమైతే తెలుగు సినిమా వరసగా జాతీయస్థాయిలో ఇక ముందు నిలవడం ఖాయం.
‘తెలుగువీర లేవరా’, ‘రాలిపోయే పువ్వా’, ‘నేను సైతం’ వంటి పాటలకు సైతం జాతీయ అవార్డులు రావడం తెలుగు సాహిత్యానికి దక్కిన గౌరవమైతే, ఈనాడు వరస చిత్రాలకు రావడం తెలుగు కథలకు దక్కిన అత్యున్నత పురస్కారంగా చెప్పాలి. ఇకమీదట జాతీయస్థాయి తెలుగు నటీనటులు కూడా తెరపై వెలుగొందాలని ఆశించడం అత్యాశ కాదేమో! వచ్చే ఏడాది కూడా తెలుగులో రెండు చిత్రాలు జాతీయస్థాయిలో కనిపిస్తే హ్యాట్రిక్‌లో ఆరు చిత్రాలు ఎంపిక కాబడటం రికార్డే అవుతుంది. ఈ ఊపుతో తెలుగు సినిమా ప్రపంచస్థాయికి ఎదిగి ఆస్కార్ రేసులో నిలవాలని ఆశిద్దాం.

-బాసు