Others

హీరో కథతో హీరో సినిమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1975లో విడుదలైన కథానాయకుని కథ చిత్రం ఇప్పటికీ అలనాటి ప్రేక్షకులను వెన్నాడే మధురమైన జ్ఞాపకం. ఎన్.టి.రామారావు అంటేనే ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోగల దిట్ట. వాణిశ్రీతో జతకట్టి ఆయన నటించిన కథానాయకుని కథ చిత్రం వైవిధ్యమైన కథనంతో రూపొంది అప్పటి ప్రేక్షకులను ఆనందంలో ముంచెత్తింది. ఈ సినిమాలో విశేషం ఏమిటంటే, హీరో పాత్రే సినిమా నటుడు. ఆయన సినీ పరిశ్రమలో నెంబర్‌వన్‌గా చెలామణి అవుతుంటాడు. ఆయన నటించిన సినిమాలన్నీ సూపర్‌హిట్లు అవుతుంటాయి. అటువంటి ఎదురులేని హీరో జీవితంలో జరిగిన మధురమైన ఘట్టాలను అల్లుకుంటూ ప్రేక్షకులకు నవరసాల విందులాగా దర్శకుడు డి.యోగానంద్ రూపొందించారు. ఓ రకంగా ఎన్టీఆర్ తొలి దశలో ఎలా వున్నారో, అలాగే ఈ సినిమా మొదలవుతుంది. ఆ తరువాత ఆయన ఎన్ని విజయాలు అందుకున్నారో, ఆ విజయాలన్నీ ఈ చిత్రంలో నమోదు అవుతాయి. 21-2-1975న విడుదలైన ఈ సినిమా నాలుగు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ ఓ హీరో కథ ఇలా వుంటుంది అన్న కథనంతో మరో చిత్రం రాకపోవడం విశేషం. అలాంటి చిత్రాలకు ఓ స్ఫూర్తిగా ఈ సినిమా నిలుస్తుంది. అప్పట్లో ఈ సినిమా షూటింగ్‌ను గుంటూరులో చేశారు. క్లైమాక్స్‌లో వచ్చే భారీ పూలరథంపై ఊరేగిస్తున్న సినిమా హారోగా ఎన్‌టిఆర్ ఆ వేడుకలో పాల్గొని గుంటూరు పట్టణానికే ఆనందం కలిగించారు. క్లైమాక్స్ చిత్రీకరణను గుంటూరు రైల్వే స్టేషన్ నుండి ప్రారంభించి చిత్రీకరించడం విశేషం. అయితే దర్శక నిర్మాతలకు వచ్చిన ఆలోచనే ఆ తరువాత ప్రేక్షకులకు ఓ వరంలా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో విపరీతమైన క్రేజ్ వున్న ఎన్టీఆర్ షూటింగ్ అంటేనే ఎక్కడెక్కడనుంచో ప్రజలు తండోపతండాలు వచ్చారు. సినిమాలో పాత్ర పరంగా సినీ హీరోకు భారీ సన్మానం, ఊరేగింపు సన్నివేశాలు చిత్రీకరించారు. దర్శకుడు డి.యోగానంద్ ప్రత్యక్షంగా ఎన్టీఆర్ అభిమానులందరినీ ఈ సన్నివేశంలో పాల్గొనేలా షెడ్యూల్ వేశారు. ఆంధ్రప్రదేశ్ నలుమూలలో వున్న ఎన్టీఆర్ అభిమానులందరినీ ఆహ్వానించి షూటింగ్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. గుంటూరులో ఊరేగింపు సన్నివేశాలు 1974లో చిత్రీకరించారు. అభిమానులు వేలాది వాహనాల్లో విచ్చేసి సందడి చేశారు. ఆనాడు ఎన్టీఆర్‌తోపాటుగా రాజబాబు కూడా షూటింగ్‌లో పాల్గొని ప్రేక్షకులకు ఆనందాన్ని అందించారు. ఈ విధంగా ఒక హీరో అభిమానులు, అసంఖ్యాకంగా హాజరై ఊరేగింపు కార్యక్రమంలో నటించడం ఒక్క ఎన్టీఆర్ అభిమానులకే దక్కిన అదృష్టం. ఆనాటి అభిమానుల్లో నేను కూడా పాల్గొనడం ఓ మధురమైన గుర్తుగా మిగిలిపోయింది.
ఇప్పుడు ఇలాంటి సంఘటనలు అసలు ఊహించలేం. ఎందుకంటే హీరో పాల్గొంటున్న సన్నివేశాలలో అభిమానులు కూడా కలిసి నటిస్తారని చెబితే, కేవలం యువత మాత్రమే ముందుకు వస్తోంది. టీవీల్లో వచ్చే కార్యక్రమాలకోసం కూడా కాలేజీలకు వెళ్లి పాసులిచ్చి మరీ ఆహ్వానిస్తున్నారు. ఇదంతా ఇండోర్‌లో జరుగుతున్న షూటింగ్ అవ్వడంవల్ల చేయగలుగుతున్నారు. అదే గుంటూరులో కథానాయకుని కథ షూటింగ్‌లాగా, మచిలీపట్నంలో దేవుడుచేసిన మనుషులు క్లైమాక్స్ షూటింగ్‌లాగా ఇప్పుడు చేయాలంటే ఊహించడమే గగనం. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి గొడవలు జరుగుతాయో, ఏ బాంబు ఎక్కడ విస్ఫోటనం అవుతుందో, చెట్లకు, స్తంభాలకు ఫ్లెక్సీలు కట్టే అభిమానులు కరెంటు షాకులతో ఎప్పుడు ఎంతమంది చనిపోతారో తెలియని పరిస్థితి ఎదురవుతోంది. అందుకే దర్శక నిర్మాతలు కూడా ఇలాంటి సాహసాలను చేయడానికి ముందుకు రావడంలేదు. అందుకే అలనాటి నటులే స్వర్ణయుగంలో ఉన్నట్లు కాదు, అభిమానులు కూడా స్వర్ణయుగంలో వున్నట్టే. ఇప్పుడంతా ఎలాంటి షూటింగ్ అయినా ఇండోర్ సెట్స్‌లో చేసుకోవడమే. ఇక అభిమానులకు ఎటూ కంప్యూటర్లలో చూసి క్లిక్స్ అందించే ఛాయిస్ ఉంది కదా! అది చాలు. చరిత్ర చిన్నదైపోతోంది మరి!

-ఉప్పు సత్యనారాయణ