Others

ఓ వెనె్నల మల్లి.. దేవులపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ అవతరించడం, కన్యాశుల్కం పుస్తక రూపంలో రావడం, కృష్ణశాస్ర్తీ జన్మించడం మూడూ ఒకేసారి జరిగాయి. అది ఒక విశిష్టమైన తేదీ. 1897, నవంబర్ ఒకటి. ‘‘కృష్ణశాస్ర్తీ కృష్ణపక్షం, నేనూ ఒకే సంవత్సరం, 1925లో పుట్టాము’’ అన్నాడు ఆరుద్ర.
పిఠాపురం సమీపాన, చంద్రమపాలెంలో జన్మించారు కృష్ణశాస్ర్తీ. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు, పిన్న వయసులోనే ఏడవ ఏట, ‘నందనందన ఇందిరానాథ వరద’ అనే పద్యాన్ని సామర్లకోటలో ఆశువుగా చెప్పారు. పదవ ఏట రామతీర్థంలో మరో ఆశు కవిత చెప్పారు. తండ్రి పెత్తండ్రులు కవి పండితులు. పిఠాపురం రాజాస్థానంలో కొలువు చేయడం, కవితాగోష్ఠులు, సాహిత్య చర్చల మధ్య పెరిగారు కృష్ణశాస్ర్తీ.
ఒక సినిమాకు పాట రాసి, సంగీత దర్శకునిచ్చారు కృష్ణశాస్ర్తీ. ‘మీ పాట ఏ రాగంలో కడితే బాగుంటుంది?’ అని అడిగాడు సంగీత దర్శకుడు. ‘పాట ఒకటికి నాలుగుసార్లు చదవండి, అదే రాగాన్ని సూచిస్తుంది’ అన్నారు కృష్ణశాస్ర్తీ. అలాగే చదివాడు సంగీత దర్శకుడు. ట్యూన్ తన్నుకుంటూ వచ్చింది. ‘ఆకులో ఆకునై, పూవులో పూవునై’ అనే పాటే రసరమ్యంగా రాగం పెల్లుబికింది. రాగాలు మోసుకొచ్చే మాటలతో పాటలల్లడం కృష్ణశాస్ర్తీకే చెల్లు. కృష్ణపక్షంలో ఇది మొదటి కవిత. తరువాతే దీన్ని సినిమాకు వాడారు.
‘మోయలేని రుూ హాయిని మోయనీ ఒక్క క్షణం’ అని పాడతాడు ప్రియుడు ప్రేయసితో.
హాయికి బరువు కనిపెట్టిన భావుకుడు కృష్ణశాస్ర్తీ.
‘‘మనసున మల్లెల మాలలూగెనే/ కన్నుల వెనె్నల డోలలూగెనే/ ఎంత హాయి రుూ రేయి నిండెనో/ ఎన్నినాళ్ళకు బ్రతుకు పండెనో’’ -హృదయం నిండా నిండుకున్న ఆనందాన్ని ఎంతో ఆహ్లాదంగా వ్యక్తీకరించాడు. మల్లీశ్వరిలో ప్రతి పాటా ఓ ఆణిముత్యం. ఆ చిత్రానికి కథ, మాటలు, పాటలు కృష్ణశాస్త్రే! చలనచిత్ర చరిత్రలో మల్లీశ్వరి ఒక కళాఖండం. సి.నా.రె కాలేజీ చదివే రోజుల్లో మల్లీశ్వరి పాటలు పాడుతూ, హీరోగా కాలరు ఎగరేసేవాడినని తనే స్వయంగా చెప్పుకున్నారు.
కృష్ణశాస్ర్తీ పిఠాపురం, కాకినాడలలో విద్యాభ్యాసం చేసి అక్కడే ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తర్వాత హైదరాబాద్ ఆకాశవాణి ఆహ్వానించింది. ఆయన రేడియో నాటికలు, పాటలు ఎన్నో రాశారు. మనకు స్వాతంత్య్రం వచ్చిన తెల్లారే మద్రాసు ఆకాశవాణి నుంచి ‘జయ జయ జయ ప్రియభారత జనయిత్రి దివ్యధాత్రి’ అనే కృష్ణశాస్ర్తీ విరచిత దేశభక్తి గీతం వెలువడింది. ఈయన రాసిన ఎన్నో పాటలకు పాలగుమ్మి విశ్వనాథం అందమైన బాణీలు కట్టారు. సంగీత సాహిత్యాల మైత్రి, వీరిద్దరి అనుబంధాన్ని మరింత ద్విగుణీకృతం చేసింది. కృష్ణపక్షం, ప్రవాసం, ఊర్వశి, పుష్పలావికలు, శర్మిష్ఠ, పల్లకీ, ధనుర్దాసు మొదలగు కావ్యాలు, చాలా సినిమా పాటలు రాశారు. కవి, గాయకుడు, వక్త, మంచి రూపిసి కూడాను.
‘‘వెనె్నల వేళనే వేణువూదేనా/ వేణువూదిన వేళ వెనె్నలాయెనా?’’ అంటూ మూడు మాటల్లో గొప్ప భావాన్ని పొదిగాడు.
‘‘శిథిలాలయములో శివుడు లేడోయి’ అంటూ
‘అడుగడుగున గుడి వుంది/ అందరిలో గుడి వుంది/ ఆ గుడిలో దీపముంది/ అదియే దైవం’ అంటాడు.
‘ప్రతీ రాత్రి వసంత రాత్రి/ ప్రతి గాలి పైరగాలి/ బ్రతుకంతా ప్రతి నిమిషం/ పాటలాగ సాగాలి’
రొమాంటిక్ పొయెట్రీలో విరహం అనుభవించిన ఆయన జీవితం ఓ పాటలాగే సాగింది. ముద్దుకృష్ణ, చలం, శ్రీశ్రీ, విశ్వనాథ, రాయప్రోలు, పాలగుమ్మి పద్మరాజు, ఆత్రేయ, ఆరుద్ర, దాశరథి, సినారె... మరెందరికో ఇష్టుడై దేవులపల్లి, అందరితో మైత్రీభావం గరపిన కవిమిత్రుడు. గాఢ స్వేచ్ఛ్భాలాషియైన కృష్ణశాస్ర్తీ,
‘‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు/ నాయిచ్ఛయే గాని నాకేటి వెరపు/ దిగిరాను దిగిరాను/ దివి నుండి భువికి’’ అంటూ, కృష్ణపక్షంలో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రా యూనివర్సిటీ కళాప్రపూర్ణను, భారత ప్రభుత్వ పద్మశ్రీని తిరస్కరించిన ధైర్యశాలి. మరుసటి వత్సరం పద్మభూషణ్ ఇచ్చి గౌరవించారు.
‘‘గోరింట పూసింది కొమ్మ లేకుండ/ మురిపాల అరచేత మొగ్గ తొడిగింది’’- సినిమా పాటైనా భావుకతలో కావ్య గౌరవానికి ఏ మాత్రం తీసిపోని రచన.
బాపుగారి సంపూర్ణ రామాయణంలో శబరి పాట-
‘‘అసలే ఆనదు చూపు, ఆపై రుూ కన్నీరు/ తీరా దయచేసిన నీ రూపు తోచదయ్యయ్యో’’ అంటూ ఆవేదన పడుతూ రాముణ్ణి కూచోబెట్టి-
‘‘కొలనునడిగి తేటనీరు/ కొమ్మనడిగి పూలచేరు/ చెట్టునడిగి పట్టునడిగి పట్టుకొచ్చిన ఫలాలు పుట్ట తేనె రసాలు’’ అంటూ ఎంగిలి తినిపించిన శబరి పాట ఓ ఆణిముత్యం. పాటల్లో ఓ పై పాట. ఎందరో కవులు- కృష్ణశాస్ర్తీ కవితాశిల్పి, పాట రాయుడు చెక్కుతాడు, తను రాసిన ప్రతి పాటకు రంగు, రుచి, వాసన అద్ది వదులుతాడు.
గొంతు పోయిన తర్వాత, నిత్యం ఆయన చేతిలో, స్క్రిబ్లింగ్‌పేడ్, కలం వుండేవి. రాయడానికే పుట్టిన మహాకవి అనిపించేవాడు. వృద్ధాప్యంలో ఓసారి నలతగా వుంటే-
‘‘శీతవేళ రానీయకు రానీయకు
శశిరానికి చోటీయకు, చోటీయకు,
ముసలితనపు అడుగుల సవ్వడి, ముంగిట వినబడెనా
వీట లేదని చెప్పించు, వీలుకాదని పంపించు’’ అని రాసుకున్నాడు.
మల్లెపూల వంటి తెల్లని దుస్తుల్లో, వెండితీగల ఉంగరాల జుట్టుతో, వౌనమునిలా, యింకా ఏదో అనే్వషిస్తున్న కన్నులతో చూపరులను ఇట్టే ఆకర్షించే మూర్తి. ధవళకాంతులీను ఓ తెల్లమబ్బు.
ఓ రోజు ఎవరో తలుపు తట్టారు. మనుషులంటే మహా ఇష్టపడే కృష్ణశాస్ర్తీ, ఏ కవి పండితుడో, ఏ సాహితీమిత్రుడో, ఏ గాయకుడో, ఏ అనుకోని అతిథో, ఏ జయకుమార్ శిష్యుడొచ్చాడో అనుకుని తలుపులు తెరిచాడు. కాలుడు కరచాలనం చేసి, భుజంమీద చెయ్యి వేశాడు. వీట లేడని చెప్పించే అవకాశం లేకుండా పోయింది. 84 ఏండ్లు జీవించి, 70 ఏళ్ళు సాహితీ సేద్యం చేసి భావకవిత్వ భాస్కరునిగా వెలిగిన కృష్ణశాస్ర్తీ ‘‘ఎగిరేను ఎగిరేను భువి నుండి దివికి’’ అన్నట్లు మేఘమాలపై పయనమయ్యాడు.
‘నా నివాసమ్ము తొలుత గంధర్వలోక
మధుర సుషమా సుధానాన మంజువాటి’’ అని పాడుకుంటూ పాడుకుంటూ వెళ్లాడు.

-కనగాల జయకుమార్