Others

మీకు తెలుసా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈనాడు చాలామంది దర్శకులు కీలకమైన సన్నివేశాలను స్లోమోషన్‌లో చూపించి ప్రేక్షకులను అలరింపచేస్తుండడం మనకందరికీ తెలుసు. కాని ఈ స్లోమోషన్ టెక్నిక్ 1953లోనే ప్రారంభమైంది. అంజలీ పిక్చర్స్ తొలి చిత్రం ‘పరదేశి’లో దర్శకుడు ఎల్‌వి ప్రసాద్ శకుంతల, దుష్యంతుల సీక్వెన్స్‌ను స్లో మోషన్‌లో చూపించారు. బొంబాయిలో శాంతారాం వద్దనున్న స్లోమోషన్ కెమెరాను తెప్పించి ప్రత్యేకంగా ఈ దృశ్యాలను చిత్రీకరించారు. ఈ దృశ్యంలో అంజలీదేవి, నాగేశ్వరరావు అక్కినేని పాల్గొన్నారు.

బందిపోటు, చిక్కడు దొరకడు, మంగమ్మ శపథం, అగ్గిపిడుగు, అగ్గిబరాటా, పిడుగురాముడు, గండికోటరహస్యం వంటి హిట్ జానపద చిత్రాలకు దర్శకత్వం వహించి ‘జానపద బ్రహ్మగా’ పేరుగాంచిన విఠలాచార్య సినిమా రంగానికి రావడానికి ముందు మైసూరులో ఓ హోటల్‌లో మేనేజర్‌గా వుండి తను పనిచేసిన హోటల్‌నే కొని మైసూర్ కేఫ్ పేరుతో నడిపారు. టూరింగ్ టాకీసులు నడిపి శంకర్‌సింగ్ అనే దర్శక నిర్మతతో కలిసి భాగస్థుడుగా మారి కన్నడంలో ‘జగన్మోహిని’ అనే చిత్రాన్ని నిర్మించారు. తెలుగు చిత్ర రంగానికి వచ్చిన తరువాత 1978లో ఇదే చిత్రాన్ని జయమాలినితో తెలుగు, తమిళ భాషల్లో నిర్మించి విజయం సాధించారు.
‘రాముడు భీముడు’ (1964) చిత్రంలో కోసం పెండ్యాల సంగీత దర్శకత్వంలో ‘తలచుకుంటే మేను పులకరించేను’ పాట రికార్డు చేయడం జరిగింది. కానీ ఆ పాటను ‘రాముడు-్భముడు’లో చిత్రీకరించడం జరగలేదు. 1965లో విడుదలైన ‘ప్రతిజ్ఞా పాలన’లో ఆ పాటను వాడుకున్నారు. ‘ప్రతిజ్ఞాపాలన’ సంగీత దర్శకుడు మాస్టర్ వేణు.
-పూజారి నారాయణ