Others

రాధా సఖీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు మగవాళ్లే ఆడపాత్రలు వేసి మెప్పించారు. అతివ ఇంత అందంగా, ఇంత వయ్యారంగా, ఇంత సొగసుగా ఉంటుందా? అని ఆశ్చర్యం కలిగేంతగా కళాకృష్ణ లాంటి వాళ్లు పాత్రల్ని పోషించి మెప్పించారు. కానీ, మహిళలు మగ పాత్రలు వేసి మెప్పించిన చరిత్రా తెలుగు తెరకు ఉంది. కళాభినేత్రి వాణిశ్రీ సతీ సక్కుబాయి చిత్రంలో శ్రీకృష్ణుడిగా మెప్పించిన సంగతి చిత్రం చూసిన వాళ్లకు ఎరుకే.

శ్రీకృష్ణుడు అనగానే తెలుగు చలనచిత్రాల్లో తొలిసారిగా గుర్తుకువచ్చేది ఎన్టీ రామారావు. ఆ పాత్రకు ఆయన తీసుకువచ్చిన గ్లామర్ సామాన్యమైంది కాదు. అభిమానుల ఇళ్లల్లో ఆయన నిలువెత్తు శ్రీకృష్ణ పాత్ర చిత్రాన్ని నిలుపుకున్నారు. హృదయాల్లో దేవుడుగా కొలుచుకున్నారు. అంతకుముందు ఈలపాట రఘురామయ్య లాంటి వాళ్లు నటించినా ఎన్టీఆర్‌కు వచ్చిన క్రేజ్ మరెవ్వరికీ రాలేదు. కాంతారావు, శోభన్ బాబు, నటుడు బాలయ్యలాంటి వారు అప్పుడప్పుడు శ్రీకృష్ణుడుగా నటించి మెప్పించినవారే. అయితే హీరోయిన్లు శ్రీకృష్ణ పాత్ర ధరించి మెప్పించిన సందర్భాలు చాలా తక్కువ. నటి జమున సంగీత లక్ష్మి చిత్రంలో శ్రీకృష్ణుడిగా కనిపిస్తారు. అలాగే అభినేత్రి వాణిశ్రీ తొలినాళ్లలో అంజలీదేవి ప్రధాన పాత్రలో నటించిన వాణిశ్రీ అంటే తొలినాళ్లలో హాస్యనటిగా చిన్న చిన్న పాత్రలతో తనను తాను నిరూపించుకుని, ఆ తరువాత శిఖరాగ్ర స్థాయి కథానాయికగా ఎదిగిన విషయం విదితమే. శ్రీకృష్ణుడు పాత్రలో హీరోయిన్లు మెప్పించడం అనేది చాలా అరుదైన ఫీట్. సినిమా కథ ప్రకారం సక్కుబాయి నీళ్లు తీసుకురావడానికి చె రువుకు వెడుతుంది. అక్కడ నలుగురు కన్యలు స్నానాలు చేస్తుంటే అది చూస్తూ తన్మయత్వంలో మునిగిపోతుంది. శ్రీకృష్ణుడు గోపికలతో ఆటలాడి వారి చేలములు దాచిన లీలలను గుర్తు చేసుకంటుంది. అలా శ్రీకృష్ణుడి ఆలోచనలోకి వొదిగిపోయిన సక్కుబాయికి శ్రీకృష్ణుని లీలలు కనిపిస్తాయి. సంగీత దర్శకుడు ఆదినారాయణ రావు ఈ పాటలో పల్లవిని హిందోళంలో, చరణాలు కాంభోజి రాగంలో కూర్చారు. ‘నేర్చేవు సరసాలు చాలా మేలా నీకీ లీల’ అంటూ గోపికగా నటించిన సచ్చు (సరస్వతి) పాటను ఎత్తుకున్నారు. అంతకుముందు వచ్చే సంగీతంలో దర్శకులు ఆదినారాయణరావు ఓ వయొలిన్ నాదాన్ని వినిపిస్తారు. పంతులమ్మ చిత్రంలో ’సిరిమల్లె నీవే విరిజల్లు కావే’ అని వచ్చే పాటలో రాజన్ నాగేంద్ర ఉపయోగించిన వయొలిన్ బీట్‌ను పోలివుంటుంది. ఓ... నేర్చేవు సరసాలు చాలా అని జానకి ఆలపించినపుడు ఘంటసాల ఆలపించిన ‘ఓ..వయ్యారమొలికే చిన్నిది మురిపించుచున్నది’ అన్న పల్లవి గుర్తుకు వస్తుంది. శ్రీకృష్ణుడుకి జిక్కి నేపథ్యగానం చేసారు. ‘నేరాలు మాని..తీరాలు చేరి..చేసాచి యాచించరే’ అన్న పంక్తిలో పాట రచయిత సముద్రాల రాఘవాచార్య అద్భుతమైన ప్రాసలను వేసారు. ‘వనె్నల చినె్నల కృష్ణయ్య‘ అని గోపిక అంటే ‘వనె్నల చినె్నల చిన్నారి’ అని కృష్ణుడంటాడు. ఆ తరువాత చరణంలో ‘నీ మురళి ఆలాపననేనే’ అన్న పదాలకు ముందు ఓ వయొలిన్ బీట్ వస్తుంది. అది ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన సీతాకోకచిలక చిత్రంలో ‘సాగర సంగమమే’ అన్న పాటలో వచ్చే మొదటి పల్లవి..కన్యాకుమారి చరణము నేనై అన్న మాటకు ముందు వచ్చే వయొలిన్ బీట్ వినిపిస్తుంది. ‘నీ చరణ ఝనంఝన నేనే’ అన్న బిట్ దగ్గర డాన్సర్ సచ్చు క్లోజప్‌లో చూపిన ఎక్స్‌ప్రెషన్ వైవిధ్యంగా వుంటుంది. ‘నేనే సుమా నీ రాసలీల’ అన్నప్పుడు మరింత అందాన్ని పొణికి పుచ్చుకుంది. పతిసుతులు నేనే అని ఎంచ..సతతము ననే్న మనోగతినుంచి అన్న పంక్తుల్లో శ్రీకృష్ణుని గీతోపదేశ సారాన్ని కవి రెండు పంక్తుల్లోనే చెప్పినట్టుగా వినిపిస్తుంది. ఇలా శ్రీకృష్ణుడు గోపికలతో బృందావనంలో చేసిన నృత్యాలను అద్భుతంగా ఈ పాటలో పొందుపరిచారు చిత్ర దర్శకుడు వేదాంతం రాఘవయ్య, నృత్య దర్శకుడు వెంపటి సత్యం. ప్రస్తుతం ఈ సినిమాకు పనిచేసిన వాళ్లలో కృష్ణుడుగా నటించిన అభినేత్రి వాణిశ్రీతో ఈ పాట గురించి అడిగితే ఇలా చెప్పారు.
నా కెరీర్ తొలినాళ్లలో ఏదో షూటింగ్‌లో వున్నప్పుడు కళా దర్శకులు వాలి, నారాయణమూర్తి, అసిస్టెంట్ డైరక్టర్ కుటుంబరావులు వచ్చారు. సతీ సక్కుబాయి చిత్రంలో కృష్ణుడుగా నటించాలని అడిగారు. రాధగా సచ్చు నటిస్తోంది అని చెప్పారు. నేనప్పటికే వెంపటి చిన సత్యం వద్ద నృత్యం నేర్చుకున్నాను. చాలామంది నేను ఓ డ్రామా ఆర్టిస్టుగానే అనుకున్నారు. డాన్సర్‌నని చాలామందికి తెలియదు. కొంతమందికి మాత్రమే ఈ విషయం తెలుసు. అందుకే ఆ కృష్ణుడి పాత్ర వరించి వచ్చింది. వీనస్ స్టడియోలో వేసిన సెట్‌లో దాదాపు పదిరోజులపాటు ఆ పాటను చిత్రీకరించారు. రాత్రి పదిగంటలనుండి షూటింగ్ ప్రారంభమై తెల్లవారు ఐదు గంటలవరకు సాగేది. పదిమంది కృష్ణుల నృత్యాలు చేసే సన్నివేశాన్ని తీయాల్సి వచ్చేది. అందుకని ట్రిక్ షాట్స్‌అన్నీ రాత్రి వేళల్లోనే చిత్రీకరించేవారు. దర్శకుడు వేదాంతం రాఘవయ్యకు, నృత్య దర్వకుడు వెంపటి సత్యంకు పాట విషయమై చాలా పోటీ వుండేది. ఇద్దరూ నృత్యరంగంలో ఆరితేరిన వారు కనుక డాన్స్ కంపోజ్ అద్భుతంగా చేసారు. అయితే ఒకరు చెప్పిన మూమెంట్ మరొకరికి నచ్చేది కాదు. వీరిద్దరి మధ్య నేను సచ్చు ఇబ్బంది పడేవాళ్లం. ఒక్కొక్కసారి నేను ఏడ్చేసేదాన్ని. అప్పుడు సచ్చునే నాకు ధైర్యం చెప్పేది. ఆమె ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతోనే ఆ పాటలో నేను నటించాను. ఎందుకు ఏడుస్తున్నావు మేకప్ పాడైపోతుంది, కళ్లు పాడైపోతున్నాయి చూడు అన్వయిస్తూ ఆమె ధైర్యం చెప్పేవారు. వేదాంతం వారికి ‘ఉడతలు పట్టేవాడు’ అన్న ఊతపదం బాగా వుండేది. అది మాపై ప్రయోగిస్తూ నాకు నచ్చేది కాదు. అలా దాదాపు పది రోజులు ఆ పాటకోసం కష్టపడ్డాం. అప్పట్లో పారితోషికం ఆ పాటకు నాలుగు వేలిచ్చారు. ఆ పాట నాకెంతో పేరు తెచ్చింది. చాలా లెటర్లు వచ్చాయి. శ్రీకృష్ణతులాభారంలో జమున ఎన్టీఆర్‌లకు సమవుజ్జీగా చేసిన పాత్రకు, మంగమ్మ శపథంలో ఒక్క డైలాగు లేకుండా చేసిన నటనకు ఎంత పేరు వచ్చిందో ఈ పాటకు అంత పేరు వచ్చింది. మంగమ్మ శపథంలో పాత్ర చేయడానికి దర్శకుడు విఠలాచార్య ప్రత్యేకంగా చెప్పి ఒప్పించారు. డైలాగు లేదని నువ్వు అనుకోవద్దని, ఆ పాత్రలో మరెవరినీ ఊహించలేకపోతున్నానని నువ్వైతే పాత్రను ఇంప్రువైజ్ చేసి మెప్పిస్తావని పట్టుబట్టి నాచేత వేయించారు. అలాగే కృష్ణుడు పాత్ర కూడా వాణిశ్రీ అయితేనే అటు నృత్యానికి, ఇటు అభినయానికి న్యాయం జరుగుతుందని నృత్య దర్శకులు భావించడం ఆ అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆ పాట చూస్తుంటే చాలా ఆనందంగా వుంటుంది. అప్పుడు మేము పడిన కష్టం కూడా గుర్తుకొస్తుంది. ఏది ఏమైనా ఓమంచి పాటలో శ్రీకృష్ణుడిగా అందరినీ మెప్పించినందుకు ఆనందం కలుగుతుంది. ఇప్పుడు సీరియల్స్‌లో సౌరభ్ జైన్ శ్రీకృష్ణుడుగా కనిపిస్తే ఈ పాటే గుర్తుకువస్తుంది. శ్రీకృష్ణుడుగా అప్పుడు మేకప్ చాలా బాగా చేసారు అని వివరించారు. ఇలా ఓ పాట కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ నటించడం ఆప్పటి స్వర్ణ యుగానికి చెందిన నటీనటులకు చెల్లింది.

-సరయు శేఖర్