Others

అన్నపూర్ణ (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈరోజుల్లో ఏ సినిమాకూ సకుటుంబ సపరివారంగా వెళ్ళే అవకాశమే లేనంత గొప్ప స్థాయిలో సినిమాలు ఉన్న విషయం తెలియంది కాదు. 1950-70 నాటి స్వర్ణయుగపు సినిమాల కోవలో జగపతివారి ‘అన్నపూర్ణ’ సినిమా నిలుస్తుంది. కధ సినిమా ఆసాంతం ఉంటుంది. కథనం నడిపే తీరు ప్రశంసనీయం. గుమ్మడి, జమున, జగ్గయ్య ప్రధాన పాత్రధారులు. చెయ్యని తప్పుకు వ్యాపార భాగస్వామి, మిత్రుడు అయిన సి.ఎస్.ఆర్ కుట్రకు బలై గుమ్మడి 14 ఏళ్లపాటు జైలు శిక్షకు గురవుతాడు. వ్యాపారంలో లాభాన్ని భాగస్వాములు సమాన భాగాలు తీసుకోవాలని గుమ్మడి వాదిస్తాడు. కానీ సియస్‌ఆర్ మొత్తాన్నీ తానే కాజేయాలని కుట్ర చేసి గుమ్మడికి 14 ఏళ్ళు జైదు పడేలా చేస్తాడు. ఈ విషయం విన్న వెంటనే గుమ్మడి భార్య గుండెపోటుతో చనిపోతుంది. 12 ఏళ్ళ పాప, ఆరేళ్ళ తమ్ముడిని తీసుకుని ఇంటిని అప్పుల వాళ్లు స్వాధీనం చేసుకోగా పిల్లలు అనాధలైపోతారు. కూలీ పనులు చేస్తూ వారు పెదవుతారు. చిన్ననాటి స్నేహితుడు పోలీసు ఆఫీసరుగా వచ్చిన జగ్గయ్య, అన్నపూర్ణగా జమును, ఆమె బుగ్గవద్ద ఉన్న పుట్టుమచ్చ ఆధారంగా గుర్తించి తన ప్రేమ తెలియజేస్తాడు. చివరకు పోలీసు ఆఫీసర్ జగ్గయ్య సాయంతో గుమ్మడి- అన్నపూర్ణ తమ్ముడి నిర్దోషిత్వం నిరూపణ, వారి విడుదల, జగ్గయ్యతో జమున పెళ్లి.. కథ సుఖాంతం!
స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో దేశ ప్రజల భావనలు, పర సంస్కృతీ వ్యామోహం, మధ్యతరగతి జీవితాలు- డబ్బు మిత్రులను శత్రువులుగా మారుస్తుందనేది నిజం. ముఖ్యంగా అమ్మా నాన్నలు దూరమైనా స్వయంకృషి, బాధ్యతలతో ఒక అక్కగా అన్నపూర్ణ జమున నటన పాత్రోచితం.. సందేశాత్మకంగా వుంటుంది. మరలా ఇలాంటి సినిమాలు తీస్తే చలనచిత్ర రంగానికి సువర్ణయుగం రాగలదు.

చాకలకొండ శారద, కావలి