Others

‘రాగమరుూ రావే...’ (నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాటకు ప్రత్యేక గౌరవం కల్పించి పట్ట్భాషేకం చేయటం సాహిత్యానికి, సంగీతానికి, గాత్రానికి ప్రథమ తాంబూలం ఇవ్వటం వంటి సర్వోన్నత ప్రక్రియలు చేయటానికి జయభేరి (1959) చిత్రా న్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పెండ్యాల స్వర నైపుణ్యం, ఘంటసాల గాత్ర ధర్మంలోని మర్మాలు జానుతెనుగు పదాల మల్లాది, నటీనటుల అభినయం అన్నీ కలిసి జయభేరి మ్రోగించాయి. పెండ్యాల స్వరకల్పన కొన్నిచోట్ల మహోత్కృష్టంగా ఉంటుంది. గాయనీ గాయకులు ఆ పరిధిని అందుకుంటే పాటకు చిరాయువు. ఈ పాటలోని మొదటి చరణం చివురులు మేసిన చిన్నారి కోయిల సినిమాలో మాత్రమే వినిపించినా రికార్డులో తొలగించారు. అయితే వెలుగుల పోహళింపు ఈ పాటలో ఎప్పటికీ మనల్ని పలుకరిస్తూనే వుంటుంది. చిగురులు చిన్నారి కోయిల మరుమల్లెలు విరజాజులు నెలరాయుడు, కలువలు జిలుగు పరిమళం పులకరింతలు కలవరింతలు అన్నీ ఘంటసాల గొంతులో మరింత తియ్యగా పలికాయి. అభేరి రాగంలో ఈ పాటని స్వరపరచి దశాబ్దాలు కావస్తున్నా ఇప్పటికీ రసిక జనుల హృదయాల్ని రసభరితం చేస్తూనే వుంది. అక్కినేని - అంజలీదేవిలపై చిత్రీకరించిన పాట ఇది.

-నీలం శివగంగాధరరావు, వీరపునాయునిపల్లె