Others

శ్రద్ధ క్లారిటీ ఇచ్చింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి’ తరువాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహో’ చిత్రం షూటింగ్ విదేశాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్‌ని ఎంపిక చేశారు. ఆమె ఎంపిక అయినప్పటి నుండి శ్రద్ధాకపూర్‌పై రకరకాల రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్ రెండు పాత్రలు చేస్తుందంటూ ప్రచారం కూడా జరుగుతోంది. అంతేకాకుండా ఆ రెండు పాత్రల్లో ఒకటి నెగెటివ్‌గా కూడా వుంటుందని చెబుతున్నారు. అయితే ఈ విషయంపై ఈ అమ్మడు స్పందించింది. తాను ఈ సినిమాలో రెండు పాత్రలు చేయడంలేదని.. ఒకటే పాత్ర అని, అది కూడా ప్రభాస్‌కు జోడీగానే ఉంటుందని తేల్చేసింది. అయితే ఈ చిత్రంలో నటించడం చాలా ఆనందంగా ఉందని, ప్రభాస్ లాంటి హీరో సరసన ఛాన్స్ రావడం లక్కీ అని చెబుతోంది. పైగా ఒకేసారి రెండుభాషల్లో పరిచయమవుతుండడంతో తెగ మురిసిపోతుంది ఈ భామ. లక్కీగర్ల్ అంటే శ్రద్ధకపూరే అంటూ ఆమె సన్నిహితులు తెగపొగిడేస్తున్నారట..అదీ విషయం!