Others

గుర్తించండి చూద్దాం (శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ చిత్రంలో కనిపిస్తున్న మహా ఇల్లాలిని గుర్తించారా? తెలుగు రాష్ట్రాలలో అధికులు ఆమెగారిని గుర్తిస్తారు. మీరూ ప్రయత్నించండి. సరే కొన్ని ఆధారాలు మీ ముందు ఉంచుతాను. ఆమెపేరుమీద ఒక ఆసుపత్రి హైదరాబాద్‌లో వుంది. ఆమె ఇద్దరు కుమారులు, ముగ్గురు మనుమలు కూడా నటులే. కేవలం ఇంటి పనులతోనే ఆమె క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. భర్త అవసరాలను స్వయంగా పరిశీలిస్తూ భోజన సమయంలో భర్త చెంతనే కూర్చుని గడపటం కూడా ఆమెకి అలవాటులో ఒక భాగం. అన్నట్లు మరో విషయం భర్తగారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఆమె ప్రతిరోజూ మధ్యాహ్నం టిఫిన్ క్యారియర్ తీసుకొని సెక్రటేరియెట్‌కు వెళ్లి భర్త భోజనం పూర్తయిన తర్వాత క్యారియర్ తీసుకొని ఇంటికి చేరుకోవటం కూడా ఆమె దినచర్యలో భాగంగా మారింది. ఆ మహా ఇల్లాలు ఎవరో ఈ సమయానికి గుర్తించి వుంటారనుకుంటాను. సరే.. ఆ వివరాలు కూడా నేనే అందిస్తాను. ఆమె పేరు నందమూరి బసవతారకం.

-పర్చా శరత్‌కుమార్ -9849601717