Others

చిత్రా. విందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దయ్యాక ఏమవుతావు అన్న టీచర్ ప్రశ్నకి పెద్ద పెయింటర్ అవుతానని చెప్పిన పాలమూరు పిల్లవాడు గోవిం దు- పి.జి. విందా పేరుతో పెద్ద సినిమాటోగ్రాఫర్ అయ్యాడు. తొలి సినిమా ‘గ్రహణం’తోనే ప్రయోగాల బాటపట్టి సక్సెస్ కొట్టాడు. అప్పటినుంచి అమీతుమీ వరకు దర్శకుడు ఇంద్రగంటి సినిమాలన్నింటికీ కెమెరా కన్ను పి.జి.విందానే! పూరీ, నీలకంఠ, వంశీలాంటి ఇతర దర్శకులతోను పనిచేసాడు. తెలుగుతోపాటు, కొన్ని హిందీ సినిమాలు, ఓ కన్నడ సినిమా కలుపుకుని మొత్తం 18 సినిమాలకి కెమెరామెన్‌గా పనిచేసాడు. గతంలో లోటస్‌పాండ్ అనే బాలల చిత్రాన్ని తీసిన విందా, భవిష్యత్తులో తెలంగాణ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే ఆలోచనలు చేస్తున్నాడు. ఆయనతో ‘వెనె్నల’ సంభాషణ.
* చిన్నప్పుడు పెయింటర్ అవ్వాలనుకున్న మీరు కెమెరామెన్ ఎలా అయ్యారు?
-మాది పల్లెటూరు, వ్యవసాయ కుటుంబం. ఇప్పుడు నాగర్‌కర్నూల్ జిల్లాలో వున్న పాలెం మా వూరు. నాకు గొప్ప పెయింటర్ అవ్వాలనుండేది. మా పేరెంట్స్‌కి అదంతా అర్ధమయ్యేది కాదు. డాక్టర్‌అయితే బాగుంటుందనుకునేవాళ్లు. హైదరాబాద్‌లో జెఎన్‌టియులో ఫోటోగ్రఫీ, పెయింటింగ్‌లలో సీట్లొచ్చాయి. అప్పట్లో గీతాంజలి, శివ సినిమాలు చూసి ఫోటోగ్రఫీని ఎంచుకున్నాను. ఫిలిం మేకర్ కావాలన్నది నా డ్రీమ్. ఫీల్డులోకి ఎంటరవ్వడానికి మీడియంగా వుంటుందని పెయింటింగ్‌ను వదిలిపెట్టాను.
* తొలి సినిమా గ్రహణంకి అవకాశం ఎలా వచ్చింది?
- కాలేజీ తర్వాత మధు అంబట్ దగ్గర మూడేళ్లు పని చేసాను. అప్పట్లో హైదరాబాద్ ఫిలిం క్లబ్‌కి వెడుతుండేవాడిని. అక్కడ దేశ దేశాలకు చెందిన మంచి మంచి సినిమాలు చాలా చూసాను. అక్కడే దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణతో పరిచయమైంది. నా పని తీరు నచ్చి తన తొలిసినిమా గ్రహణంకి అవకాశమిచ్చారు.
* గ్రహణం సినిమాకి కెమెరా పరంగా మీరొక రివల్యూషన్ తెరతీసారు...డిజిటల్ ఫార్మట్‌కి వెళ్లి ఒక ప్రయోగం చేసారు. తొలి సినిమాకే రిస్కు చేయడం అవసరమా! మీకు అంత నమ్మకం ఎలా వచ్చింది?
- తెలుగులో డిజిటల్ ఫార్మట్‌లో వచ్చిన తొలి సినిమా ఇది. తక్కువ బడ్జెట్‌లో తీయడానికి ఒక మార్గంగా దీన్ని ఎంచుకున్నాం. అప్పటికి ఫిలిం కెమెరాలు వున్నాయి. డిజిటల్ కేవలం న్యూస్‌కీ, టీవీకి మాత్రమే పరిమితమై ఉండేది. దాంతో ఈ రిస్కు తీసుకోవడానికి ఎవరూ సాహసించేవారు కాదు. అప్పట్లో డిజిటల్ క్వాలిటీ ఎలావుండేదో చెప్పాలంటే ఇప్పుడున్న స్మార్ట్ఫోన్ కంటే నాలుగు వంతులు తక్కువ క్వాలిటీ వుండేది. 2004లో గ్రహణం తీసే సమయంలో రాబోయే పదేళ్లలో మొత్తం డిజిటల్ అవుతుందని నేను ఊహించాను. చాలామంది కాదన్నారు. క్వాలిటీపైన వాళ్లకి నమ్మకం లేదు. ఇప్పుడు చూడండి, అది తప్ప ఇంకో మార్గమే లేదు. అమెరికన్ సినిమాటోగ్రఫర్స్ అందరూ డిజిటల్‌నే ఫాలో అవుతున్నారు. మిగతా ప్రపంచం వాళ్లను ఫాలో అవుతున్నది. నేను అవన్నీ స్టడీ చేస్తూ నన్ను నేను అప్‌డేట్ చేసుకుంటాను. అందుకే అప్పుడు ధైర్యం చేసాను.
* ఈమధ్య మొబైల్ ఫోన్లతో కూడా సినిమాలు తీస్తున్నారు కదా!
- అవును. సినిమా దేనితో తీసామనేది ఇంపార్టెంటు కాదు. సెనే్సషన్ కోసం తీయడం ముఖ్యం కాదు. దేనితో తీసినా క్వాలిటీ రీచ్ అవుతున్నామా లేదా అనేది చూడాలి. బొమ్మను రంగులతో వేసామా, చార్‌కోల్‌తో వేసామా అనేది కాదు, అందులో కళ పలికిందా లేదా అనేది పాయింట్!
* అన్నట్టు మీరు పెయింటింగ్‌ను ఇష్టపడే పిల్లాడి కథతో లోటస్‌పాండ్ అనే సినిమా తీసారు కదా...అంటే లోపల ఆ ప్యాషన్ అలాగే వుండిపోయినట్టుంది?
- అవును. పెయింటింగ్ అంటే బాగా ఇష్టం. లోటస్‌పాండ్‌ను నా ఆటోబయోగ్రఫికల్ మూవీ అనుకోవచ్చు. పెయింటింగ్‌ను ఇష్టపడే పిల్లాడి కధ అది. పూరీ కొడుకు ఆకాశ్ నటించాడు పెయింటింగ్ అంటే నాకు ఎంత ఇష్టమంటే-మైకెలాంజిలో నా ఫేవరేట్. అతడి పెయింటింగ్స్‌ను చూడ్డానికి వాటికన్ వెళ్లాలని వుండేది. చివరికి వాటికన్‌లో నాలుగురోజులపాటు ఓ సినిమా షూటింగ్ చేసే అవకాశం వచ్చింది. అలా నా కల నెరవేరింది. ఇక లజ్జ సినిమాకి నేను అసిస్టెంట్ కెమెరామెన్. అప్పుడు ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేసన్‌తో కలిసి ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వచ్చింది.
* గ్రహణం తర్వాత కెరీర్ ఎలా సాగింది?
-గ్రహణం సినిమాకి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రధమ దర్శకుడి చిత్రంగా అవార్డు వచ్చింది. సినిమాటోగ్రఫర్‌కి నాకు ప్రశంసలొచ్చాయి. ఇది చూసి నీలకంఠ ‘నందనవనం 120 కిమీ’ అవకాశమిచ్చారు. ఆ తర్వాత వంశీ ‘అనుమాస్పదం‘ చేసాను. ఇక నేను పనిచేసిన అష్టాచెమ్మా, వినాయకుడు కమర్షియల్‌గా సక్సెస్ అయ్యాయి.రీసెంట్‌గా జెంటిల్‌మేన్, అమీతుమీ హిట్ కొట్టాయి. పూరీ తీసిన జ్యోతిలక్ష్మి, లోఫర్ సినిమాలకి కూడా పని చేసాను. తెలుగు, కన్నడ, హిందీ అన్నీ కలుపుకుని ఇప్పటికి 18 సినిమాలు చేసాను.
* దర్శకుడి ఊహలకు దృశ్యరూపమివ్వడానికి కెమెరామెన్‌లు ఏవిధంగా కష్టపడతారు? కెమెరామేన్ దర్శకుడైతే కలిగే లాభమేంటి?
- దర్శకుడి మనసులో వున్న ఊహలకి దృశ్య రూపమివ్వడానికి కెమెరామెన్‌లు ఒక మూడ్‌ను, ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం ఎలా అనేది ఆలోచిస్తారు. కెమెరా మూమెంట్స్ ద్వారా, లైటింగ్ ద్వారా ఎఫెక్టు అలా తీసుకురావాలనేది వీళ్ల కంట్రిబ్యూషన్. సినిమా ప్రధానంగా విజువల్ మీడియం కాబట్టి కెమెరామెన్ దర్శకుడైతే విజువల్‌గా కథనంలో పట్టు వుంటుంది.
* మళ్లీ దర్శకత్వంవైపు వెడతారా? తెలంగాణ బిడ్డగా, తెలంగాణ సినిమా ఆలోచన ఏమైనా ఉందా?
- నా దగ్గర తెలంగాణపై కొన్ని షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. ఇక్కడి కల్చర్, ఇక్కడి లైఫ్, ఆచార వ్యవహారాలపై ఫీచర్ ఫిల్మ్ చేయాలని వుంది. తెలంగాణ రాకముందు నుంచే నా నేటివిటీకి సంబంధించి ఈ కథలను రాసుకున్నాను. మామూలుగా తెలంగాణ సినిమా అనగానే ఉద్యమ సినిమా అనో, నక్సలైట్ సినిమా అనో అభిప్రాయపడతారు. కానీ కల్చర్‌ను, జన జీవితాన్ని రిఫ్లెక్ట్ చేసే ఒరిజినల్ తెలంగాణ సినిమా ఇంకా రాలేదు. ఆ దిశగా నేను నా వంతు కృషి చేయాలనుకుంటున్నా!
* ఇటువంటి ఆలోచనలు తెలుగు ఇండస్ట్రీలో వర్కవుటవుతాయా?
- మనోళ్లు బి..సి..సెంటర్లను దృష్టిలో పెట్టుకుంటారు. రిక్షా కార్మికుడికి కూడా వినోదాన్ని ఇవ్వాలంటే అతడిని మైమరిపించే కథలు తీయాలంటారు. నిజ జీవిత కథలు కమర్షియల్ హిట్ కావని పాంటసీని ఇష్టపడతారు. కానీ దంగల్‌ను చూడండి, కమర్షియల్‌గా కూడా భారీ హిట్ కొట్టింది. ఇప్పుడు బాలీవుడ్‌లో మాదిరిగా తెలుగులో, తమిళంలో, మలయాళంలో కొత్త ధోరణులు ప్రయోగాలు మొదలయ్యాయి. నెమ్మదిగా మార్పు వస్తోంది.
* ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చే కొత్తవాళ్లకి అవకాశాలు ఎలావున్నాయి?
- పాతకాలంలో మాదిరిగా ఇప్పుడు కంపల్సరీగా ఎవరికిందైనా పనిచేస్తేనే దర్శకుడవ్వాలని, కెమెరామెన్ అవ్వాలని రూల్ లేదు. ఫిలిం కోర్సులున్నాయి. అవి చేసుకుని కొన్నాళ్లు ఇంటర్న్‌షిప్ చేస్తే చాలు..బాగా చదువుకుని సాహిత్యం, సమాజం, కల్చర్ వంటి అంశాలపై వగాహన ఎక్కువ వున్నవాళ్లు రావాలి. అప్పుడు మంచి ఐడియాలతో సినిమాలొచ్చే అవకాశముంది. సక్సెస్ రేషియో కూడా ఎక్కువే వుంటుంది.

-నూతలపాటి నూతన్