Others

అంతం (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో 1990ల్లో వచ్చిన ‘అంతం’ నాగార్జున సినీ ప్రస్థానంలో ఓ మైలురాయి. వాణిజ్యపరంగా అంత విజయవంతం కాకున్నా, నటనాపరంగా ఒక క్లాస్ ముద్రను వేసింది. డానీ, సలీంగౌస్‌లు టాలీవుడ్‌కు కొత్త. అదో వెరైటీగా నిలిచింది. ఊర్మిళ చలాకీ నటన, చివరల్లో నిజం తెలిసి భయపడ్డం, స్థాణువైపోవడం బాగా చేసింది. నాగార్జున నోరు తెరిచి మాట్లాడ్డం చాలా తక్కువ ఇందులో. శేఖర్ ఉరఫ్ రాఘవగా కూల్‌గా, స్టయల్‌గా చేశాడు. కిక్ ఫైట్స్ ఓ ట్రెండ్. కాస్ట్యూమ్స్ కూడా కరెక్టుగా కుదిరాయి. థియేటర్‌లో సినిమా నడుస్తుందా? లేదా? అని బయటివాళ్లకు డౌట్ వచ్చేంత సైలెంట్‌గా సాగుతుంది. నాగ్ ఓ కిల్లర్. ఊర్మిళ ఓ ‘ఆర్నిథాలజీ’ స్టూడెంట్. అనుకోకుండా కలవడం, ప్రేమగా మారడం, అది నేర వృత్తికి ఆటంకంగా మారడం, బాస్‌తో పొరపొచ్చాలు, చివరకు అది పోలీసులకు అనుకూలించి నాగ్‌ను చంపడం- ఇదే అంతం. టేకింగ్ కొత్తగా వుంటుంది. శ్రీలంక లొకేషన్ అందంగా చూపించాడు. కీరవాణి, ఆర్.డి.బర్మన్, మణిశర్మ ముగ్గురూ సంగీతం అందించడం ఆశ్చర్యం. సిల్క్‌స్మిత సాంగ్ కూడా ఉంది. వౌత్ ఆర్గాన్‌తో నాగ్ పలికించే మ్యూజిక్ వెంటాడుతుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరింది. ‘చలెక్కి ఉందనుకో’, ‘ఓ మైనా’, ‘ఇంతసేపైనా ఎదురుచూసేన’, ‘నీ ప్రేమ చెప్పింది నాతో’ పాటలు ఒకత్తయతే, ‘ఊహలేవో రేగే’ ఆర్.డి.బర్మన్ మ్యూజిక్‌లో అదిరింది. టీవీలో రావడం చాలా అరుదు. అసలు రాదు. కాబట్టి మంచి డివిడి కొనుక్కుని చూడ్డమే. మనసును తాకే సినిమా. విషాదాంతమే అయినా కరెక్టే అనిపిస్తుంది. ఇది సినీ సూత్రం మాఫియా సినిమాలకు. యూత్ మెచ్చిన సినిమా.

-కాళిదాసు, కావలి