Others

క్రేజీ భామ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో 2010లో వచ్చిన ‘దబాంగ్’ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలియంది కాదు. ఈ చిత్రం ద్వారా తొలిసారి వెండితెరపై అడుగుపెట్టిన అందాలభామ సోనాక్షి సిన్హా క్రేజీ హీరో సల్మాన్‌ఖాన్‌తో జోడీ కట్టి ఎంతో పాపులర్ అయింది. ప్రఖ్యాత సీనియర్ నటుడు శత్రఘ్నసిన్హా తనయగా సినీరంగ ప్రవేశం చేసినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకోవడానికి సోనాక్షికి ఎంతో కాలం పట్టలేదు. తొలినాళ్లలో నటించిన ప్రతీ చిత్రం బాక్సాఫీస్ వద్ద వరుసగా బంపర్ హిట్‌గా నిలిచి ఈ భామకు కెరీర్‌లో తిరుగులేకుండా చేసింది. దాంతో అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్‌గా ఆమె పేరు మారుమోగింది. బాలీవుడ్‌లోకి వచ్చి అప్పుడే ఏడేళ్లు గడిచిపోయాయి. ఈ విషయాన్ని సోనాక్షి తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. తన అభిమానులు కురిపించిన ప్రేమానురాగాలను ఎన్నటికీ మరచిపోలేను అని చెబుతున్న సోనాక్షి తనకు ‘దబాంగ్’లో అవకాశం ఇచ్చిన సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, అభినవ్ కశ్యప్‌కు ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. అభిమానుల ఆదరణతో చాలా కాలం బాలీవుడ్‌లో నచ్చిన పాత్రలతో మరింత ముందుకు దూసుకెళతానని కూడా పేర్కొంది. సోనాక్షి సిన్హా చిత్రసీమలోకి అడుగుపెట్టి అప్పుడే ఏడేళ్లు పూర్తయ్యాయి అంటే ఆశ్చర్యం కలుగుతుందని, ఆమె చేసిన చిత్రాలు.. పోషించిన పాత్రలు వేటికవే భిన్నంగా ఉండడం వల్లే ఆమెకు ఇంతటి క్రేజ్ ఏర్పడిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. క్రేజీ గర్ల్‌గా ఇంత పాపులర్ కావడానికి కారణం అని సోనాక్షిని కదిలిస్తే- ‘‘మంచి చిత్రాలు.. మంచి బ్యానర్లు.. అంతకంటే ఎక్కువ ఆదరణ నాకు బాలీవుడ్ నుంచి లభించాయి. ముఖ్యంగా నేను నటించిన చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఆదరిస్తూనే వున్నారు. ఇలా అందరి అభిమానాన్ని పొందాను కాబట్టే నాకు ఇలాంటి ఇమేజ్ లభించిందనుకుంటున్నా. నాపై కురిపిస్తున్న అభిమానానికి సదా రుణపడి వుంటా’’అంటూ చెప్పుకొచ్చింది. సోనాక్షియా.. మజాకా!
*