Others

‘గుండమ్మ’ పాత్రకు జీవం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1960కి ముందు విఠలాచార్య కన్నడంలో నిర్మించిన ‘మనేతుంబిదహెన్ను’ ఆధారంగా విజయవారు ‘గుండమ్మకథ’ నిర్మించారు. తెలుగు నేటివిటీ ఏ మాత్రం తగ్గకుండా శ్రద్ధ తీసుకున్నారు. కన్నడ మాతృకలో గుండమ్మకు భర్త వుంటాడు. తెలుగులో చక్రపాణిగారు వూరు పేరు లేని అటువంటి భర్త వున్నా లేకున్నా ఒకటేనని ఆ పాత్రను తొలగించి గుండమ్మ పాత్రకు జీవం పోశారు. ఆ పాత్రను సూర్యకాంతం చిరస్మరణీయంగా పోషించింది. కె.వి.రెడ్డి, కె.ఎస్.ప్రకాశరావు వంటి హేమాహేమీలు ఇందులో ఏ మాత్రం కథ లేదని, విజయం అసాధ్యమని పెదవి విరిచినా, సజీవమైన పాత్రలు, ఆ పాత్రలకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేసిన నటీనటులు, డి.వి.నరసరాజు మాటలు, పింగళి పాటలు, ఘంటసాల సంగీతం చిత్ర విజయానికి దోహదం చేశాయి. చిత్రం రజతోత్సవాలు జరుపుకుంది. ఎన్.టి.రామారావుది నూరవ చిత్రం. తమిళ వెర్షన్ ‘మనిదన్ మారవిల్లై’ అక్కినేని నూరవ చిత్రం. తమిళ వెర్షన్‌కు చక్రపాణి దర్శకత్వం వహించడం విశేషం.
పాట అలా పుట్టింది...
ఆత్రేయ ఒకసారి ఒక సమావేశానికి వెళ్లారు. అదే సమావేశానికి ఒక నిర్మాత వచ్చాడు. ఇద్దరూ ఎదురుపడ్డారు. నిర్మాత ‘ఏమిటండీ ఆత్రేయగారూ! నా పాట సంగతేం చేశారు. చాలాకాలమైపోయింది’ అని నిలదీశారు. ఆత్రేయ ఖంగుతిని ‘ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను’ అని అనగానే నిర్మాత ఎగిరి గంతేసి పాటకి పల్లవి వచ్చేసింది, ఇంక కానీయండి అన్నాడు. ‘ఆలుమగలు’ (1977)లోని ఆ పాట అలా పుట్టింది.

-పూజారి నారాయణ