Others

నట వారసత్వం (శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక డాక్టరు తన కుమారుడిని డాక్టరుగా తీర్చిదిద్దాలని, ఒక ఇంజనీర్ తన కొడుకుని ఇంజనీర్‌గా తీర్చిదిద్దాలని అనుకోవటంలో తప్పులేదు. ఆశ్చర్యపోవలసిన పని కూడా లేదు. నటుడు కాంతారావు తన మూడవ కుమారుడు రాజాను చిన్నతనం నుంచి గమనిస్తూ నటనా రంగంపై ఆసక్తిగా వున్నట్లు భావించి, నటనారంగంలో తర్ఫీదు ఇవ్వటం ప్రారంభించాడు. జానపద చిత్రాలలో రాజకుమారుడిలాగా కత్తి యుద్ధం చేయటం, రాజుల సంభాషణలను కూడా తర్ఫీదు ఇవ్వటం ప్రారంభించాడు కాంతారావు. అక్కినేని నాగేశ్వరరావు, దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు చక్రవర్తి చిత్ర అను నిర్మాణ సంస్థను ప్రారంభించి కమర్షియల్ చిత్రాలే కాక, ప్రభోదాత్మక చిత్రాలను నిర్మించాలని సంకల్పించారు. వారి ప్రథమ చిత్రం ‘సుడిగుండాలు’లో నటించడానికి ఒక బాలనటుడి అవసరం ఏర్పడింది. కాంతారావు కుమారుడు రాజా విషయం అక్కినేని చెవిన పడింది. అక్కినేని, కాంతారావు ఇంటికి వెళ్లి రాజాను చూసి తాము నిర్మించ తలపెట్టిన ‘సుడిగుండాలు’ చిత్రంలో రాజా అన్ని విధాలా సరిపోతాడని నిశ్చయించుకొని దర్శకుడు ఆదుర్తికి చెప్పాడు. ఒక నటుడు తన కుమారుడికి నటనలో ఇస్తున్న శిక్షణ.. మరో మహానటుడు నిర్మించ తలపెట్టిన పాత్రకు అన్ని విధాలా సెలెక్ట్ కావడం కేవలం యాదృచ్ఛికంలా లేదూ! ఇక ఆ తర్వాత తరాల సంగతి మీరు గమనిస్తూనే వున్నారు. మహానటులు ఎన్‌టిఆర్, అక్కినేని కుటుంబాల మూడవ తరం కూడా నటులుగా స్థిరపడుతున్నారు. చిరంజీవి కుటుంబంనుంచి నట వారసులు వచ్చారు. అలాగే మోహన్‌బాబు, గిరిబాబు, శ్రీకాంత్ వారసులు కూడా నటనారంగానికి వచ్చారు. బాలకృష్ణ, రవితేజ వారసులు కూడా త్వరలో రానున్నారు. సంతోషకరమైన విషయం ఏమిటంటే రాబోయే కాలంలో అక్షరాభ్యాసం నుంచే తయారైన నటీనటులు కళారంగానికి రానున్నారు.

-పర్చా శరత్‌కుమార్ -9849601717