Others

తిరుగులేని తార

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కథానాయిక ప్రాధాన్యత ఉన్న సినిమాల కోసం చాలా కాలం ఎదురుచూశాను. అలాం టి చిత్రాల్లో నటించాలంటే ప్రతిభకు తోడూ అదృష్టమూ కలిసిరావాలి. అలా కుదిరినప్పుడే కెరీర్‌లో అనుకున్నది సాధించడానికి వీలుంటుంది. అప్పుడే తృప్తి’’ అంటోంది అందాలతార నయనతార. దాదాపు పదేళ్లపాటు టాలీవుడ్, కోలీవుడ్ అంటూ తెగ తిరిగేసిన ఈ భామ ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేసింది. ఒక విధంగా చెప్పాలంటే దర్శక, నిర్మాతలు కూడా నయనను అదే దారిలో నడిచేలా చేశారని చెప్పొచ్చు. గ్లామర్ పాత్రలతో ఒక దశలో నయనకే విసుగు అనిపించిందట. అంతేకాదు.. సినిమాలు మానేయాలన్న ఆలోచన కూడా కలిగిందట. సరిగ్గా ఆ ఆలోచన తనలో కలిగిన సమయంలోనే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చిపడిందట. అలా వచ్చిన అవకాశం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దాంతో వరుసగా నయనకు అలాంటి చిత్రాల్లో చేసే అవకాశం తలుపుతడుతూనే వుందట. అయితే వచ్చిన అవకాశాలన్నింటినీ ఒప్పేసుకుని రాజీ పడకుండా విభిన్నమైన కథలనే ఎంచుకుంటూ కెరీర్‌పై ఎంతో శ్రద్ధ వహించిందట. అదృష్టంతో పాటు కష్టపడి పనిచేయడంతో నయనకు బాగా కలిసి వచ్చింది. అదృష్టం వుంది కదా అని పనిచేయడం మానేస్తే సినిమాలు ఉండవు అని ఆమె బాగా నమ్ముతుంది. అదే తన విజయ రహస్యం అని కూడా చెబుతోంది. దక్షిణాదిలో అగ్రనటిగా ఇప్పటికీ నయనతారకు మంచి క్రేజ్ వుంది. ఆ క్రేజే ఆమెను ఇన్నాళ్లు అదే రీతిలో ముందుకు సాగేలా చేస్తోంది. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా అందరితోనూ జోడీ కట్టింది. వెండితెరపై అడుగుపెట్టిన తొలినాళ్లలో తనూ చిన్న నటినే అన్నది నయన మరచిపోదు. ఆ సమయంలోనే సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రంలో నటించే అవకాశం ఆమెకు వచ్చింది. ఆమె చిన్న నటి అని రజనీ ఆమెతో నటించడం మానలేదు కదా? అంత పెద్ద స్టార్‌కే లేని పట్టింపు తనకెందుకు? అన్నది ఆమె ప్రశ్న. అలా ఆలోచించింది కాబట్టే తిరుగులేని తారగా కెరీర్‌లో ఎన్నో పాత్రలను అవలీలగా చేసేసింది. మూడు కోట్లు పారితోషికం తీసుకుంటున్న దక్షిణాది అగ్రనటి నయనతార. ఆమె ప్రేమలో పడటం, పెళ్లి విషయంలో ఓడిపోవడం, యువ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో సహజీవనం.. ఇవన్నీ తెలిసినవే. వాటినన్నింటినీ ఎదురీది ధైర్యంగా ఇంకా కెరీర్‌లో విభిన్నమైన పాత్రలు చేస్తూనే వుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎంత నష్టం వాటిల్లినా ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. ఎంత వౌనంగా వుంటే అంత మంచిది అన్నది నయన మనసులోమాట. నయనతార తీసుకుంటున్న పారితోషికం గురించి ఆమె ఎక్కడికెళ్లినా పదే పదే ప్రశ్నిస్తుంటుంది మీడియా. ఈ విషయం గురించి ఆమెను కదిలిస్తే- ‘‘ఎన్నో ఏళ్లుగా పరిశ్రమలో వున్నా. ఇప్పుడున్న అందరి హీరోయిన్లతో పోల్చుకుంటే నేను సీనియర్నే. అలాంటి నాకు కొంచెం ఎక్కువ పారితోషికం ఇవ్వడంలో తప్పేంలేదు కదా? ఇతర రంగాల్లో కూడా సీనియర్స్‌కు ఎక్కువగానే జీతాలు ఉంటాయి కదా!. అయినా నా పారితోషికం గురించి నా చిత్రాల దర్శక, నిర్మాతలు చూసుకుంటారు. నేను ఎప్పుడూ నాకు ఇంత కావాలి.. అంత కావాలి అని అడగలేదు. అడగను కూడా. నాకు ఎంతివ్వాలో వారికి బాగా తెలుసు. ఈ విషయంలో నాపై వచ్చే రూమర్స్‌ని నేను ఏ మాత్రం పట్టించుకోను’’ అంటూ ఎంతో తెలివిగా చెప్పుకొచ్చింది. దటీజ్.. నయన! *