Others

‘ఓం నమో శివ రుద్రాయ’’(నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2010లో విడుదలై బాక్సాఫీసు విజయాన్ని చవిచూడలేకపోయిన ‘ఖలేజా’ అనే చిత్రంలోని పాట ఎప్పటికీ చిరస్మరణీయమై సంగీత సాహితీప్రియులను మరిపించి మురిపించింది. సిరివెనె్నల సీతారామశాస్ర్తీ శిష్యరికంలో తర్ఫీదు పొందిన రామజోగయ్య శాస్ర్తీ కలం నుంచి జాలువారిన ఈ గీతం నాటి ‘శంకరాభరణం’ గీతాలకు ధీటుగా నిలిచి ప్రశంసార్హమైంది! సన్నివేశపరంగా ఓ ఆదివాసీ ద్వారా పలకించిన ఈ పాట శుద్ధ జానపద శైలిలో రుద్ర శతకం నుంచి గ్రహించబడిన పరమశివుని రూప వర్ణనలు సర్వజనామోదమై సామాన్యులను సైతం భక్తిపారవశ్యంతో ముంచెత్తాయి. ముఖ్యంగా పద ప్రయోగయుతంగా ‘సదాశివ సన్యాసి - తాపసి- కైలాసవాసి- నీ పాద ముద్రలు మోసి- పొంగిపోయినది పల్లె కాశి’ వంటి బహువ్రీహి సమాసముల అల్లిక అత్యద్భుతంగా అలరించింది. సంగీత పరంగా మణిశర్మ అందించిన బాణీ, దాన్ని భావగర్భితంగా ఆలపించిన గాయకుడు కారుణ్య తదితరులు ధన్యులు. వేదాంత ధోరణిలో పాట ముగింపును ‘లోకాలనేలేటోడు - నీకు సాయం కాకపోడూ- యె నీలోనె కొలువున్నోడు నిన్ను దాటి పోనె పోడూ’ అని ఆత్మవివ్వాసం పెంపొందేలా చెప్పి ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడు అనే నమ్మకాన్ని కలిగించిన కవి శ్రీయుత రామజోగయ్య శాస్ర్తీకి హాట్సాఫ్! బహుశా ఈ పాట ఒక్కడికే కాదు అందరికీ నచ్చుతుందని నా భావన! అదే నిజం కూడా!

-మరువాడ భానుమతి, హైదరాబాద్