Others

అదృష్టవంతులు (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినోదం, సెంటిమెంటు, హుషారైన పాటల మేళవింపుతో తయారైన క్రిస్పీ వంటకంలాంటి చిత్రం అనాథగా వున్న అక్కినేనిని దొంగల ముఠా తమలో కలుపుకోవడంతో, అతడు ఆరితేరిన దొంగగా మారి అవలీలగా దొంగతనాలు చేస్తూ ఆ ముఠాలో కీలకంగా మారతాడు. కాని ఒకసారి దొంగతనంతోపాటు ఆ ముఠా ఒక బాలుడిని కిడ్నాప్ చేయడంతో దానిని విభేదించిన అక్కినేని తిరిగి ఆ బాలుడిని వారికి అప్పగించడానికి వెళ్లగా కొడుకును దూరం చేసుకున్న ఆ తల్లి గుండెపోటుతో మరణించడంతో దొంగతనాలకు స్వస్తి చెప్పి అక్కినేని పోలీసులకు లొంగిపోతాడు. తరువాత లారీ డ్రైవరుగా స్నేహితుడు పద్మనాభంతో జీవిస్తుండగా, మగవాని వేషంలో లారీలో తప్పించుకు వచ్చిన జయలలిత అతడిని ప్రేమించి పెళ్లిచేసుకోవడం వాళ్లకి పాప పుట్టడం జరుగుతుంది. స్వంత లారీ ఏర్పాటుచేసుకున్న అక్కినేనిని ఎలాగైనా తిరిగి తమ ముఠాలోకి తీసుకురావాలన్న పాత ముఠా ప్రయత్నాలలో భాగంగా లారీని తగులబెట్టడం, జ్వరంతో ఉన్న అక్కినేనికి మందు, ఆకలిగా వున్న కూతురికి అన్నం పెట్టాలని జయలలిత క్లబ్‌లో నృత్యం చేయడంతో అక్కినేని ఆగ్రహం, ఆవేదన చెందుతాడు. మరోవైపు ఎక్కడ ఏ నేరం జరిగినా పోలీసులు అక్కినేని చుట్టూ తిరగడం అతనిలో ఆవేదనను గురిచేసి తిరిగి ముఠాలోకి ప్రవేశిస్తాడు. అయితే దొంగగా కాక వారి రహస్యాలు తెలుసుకుని సాక్ష్యాలతో పోలీసులకు పట్టిచ్చి తన నిజాయితీని నిరూపించుకుంటాడు అక్కినేని. ముందు దొంగగా తరువాత మారిన మనిషిగా అక్కినేని గొప్ప అభినయం కనబరచడమే కాదు ‘అయ్యెయ్యో బ్రహ్మయ్య’, ముద్దంటేచేదా, పడిన ముద్ర చెరిగిపోదురా పాటలతో హుషారైన నృత్యాలతో అలరించారు. అతని ప్రియురాలిగా జయలలిత నృత్యాలతో, అభినయంతో అలరించగా, ఛాయాదేవి, సూర్యకాంతం, పద్మనాభం, గీతాంజలి కడుపుబ్బ నవ్వించారు. కె.వి.మహదేవన్ సంగీతంలో ప్రతి పాట మురిపించగా, ‘నమ్మరేం’ పాట ఆలోచింపజేసింది. ఘంటసాల, సుశాల పాటలన్నీ మధురంగా గానం చేసి సినిమా విజయంలో ప్రముఖ పాత్ర వహించారు. ప్రతినాయకులుగా జగ్గయ్యి, ప్రభాకర్‌రెడ్డి మంచి నటన అందించగా, విజయలలిత నృత్యాలతో అలరించింది. అన్నీ సమపాళ్ళలో మేళవించడంతో మంచి విజయం నమోదు చేసుకున్న ఈ చిత్రం జగపతి సంస్థ 1969లో విడుదల చేసి విజయం సాధించింది.

-సుసర్ల సర్వేశ్వర శాస్ర్తీ, విశాఖపట్నం