Others

దీపిక హల్‌చల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఇటీవల ఓ మాగ్జిన్‌కి హాట్ ఫొటో షూట్‌తో దర్శనమిచ్చి అందరి మతులు పోగొట్టింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా హల్‌చల్ చేయడం వల్ల దీపిక మరింత వార్తల్లోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో కథానాయికల అందాల ప్రదర్శన శృతి మించిపోతోంది. ఇలాంటి గ్లామర్ షోలను యువతరం తనివితీరా ఎంజాయ్ చేస్తున్నా, కొందరికి మాత్రం తీవ్రంగా ఒళ్లు మండిపోతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పలు విమర్శలు కూడా చేస్తున్నారు. ఇలాంటి విమర్శలకు దీపిక వెంటనే కౌంటర్ కూడా ఇచ్చింది. మొన్నటి వరకు ప్రియాంక చోప్రాపై విమర్శలు చేశారు. ఇప్పుడు నన్ను టార్గెట్ చేశారు. అయినా మేం ఎప్పుడు ఎలా కనిపించాలన్నది మా పర్సనల్ మ్యాటర్. ఇందులో ఇతరుల జోక్యం అవసరం లేదు. మా లుక్ నచ్చితే ఎంజాయ్ చేయండి, లేదంటే అస్సలు పట్టించుకోకండి. అంతేగాని ఇలాంటి విమర్శలు చేయొద్దు అని గట్టిగానే ఘాటుగా బదులిచ్చింది. అంతటితో ఆగకుండా అసలు డ్రెస్‌కి సరిపోయేలా బాడీని మలుచుకోవడానికి ఎంత కష్టపడతామో మీకు తెలుసా? అని కూడా ఎదురు ప్రశ్నించింది దీపిక. ఈ బ్యూటీ ఇటీవల ‘ట్రిపుల్ ఎక్స్’ అనే హాలీవుడ్ చిత్రంతో అలరించింది. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘పద్మావతి’ అనే సినిమా చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి విశేషంగా ఆకట్టుకుంది. ఈ మధ్య ఫోర్బ్స్ విడుదల చేసిన అత్యధిక పారితోషికం పొందుతున్న వారి జాబితాలో దీపికా పదుకొనే ప్రపంచ నటుల్లో పదవ స్థానంలో నిలిచింది. హాలీవుడ్ నటుడు ఆస్కార్ విన్నర్ జెన్నీఫర్ లారెన్స్, జూలియా రాబర్ట్ వంటి వారు కూడా దీపిక తర్వాతే ఉండటం గమనార్హం. ఈ జాబితా ప్రకటించాక దీపిక రెమ్యూనరేషన్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదట. దీపికా ఏదైనా సినిమాకు కమిట్ అయితే.. దాని కోసం తన సమయాన్నంతా కేటాయిస్తుంది. తనకిచ్చిన క్యారెక్టర్‌పై దృష్టి కేంద్రీకరిస్తుందని టాక్. ఆమె పనికి తగినట్టుగానే భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ కూడా చేస్తుందట. తాజా ‘పద్మావతి’ చిత్రం కోసం రూ. 12 కోట్ల పారితోషికంగా ఇవ్వాలని డిమాండ్ చేసిందట. దానికి అంగీకరించే భన్సాలీ షూటింగ్ మొదలు పెట్టాడట. ఈ చిత్రంలో దీపికతో పాటు రణవీర్ సింగ్ షాహిద్ కపూర్ కూడా నటిస్తున్నారు. అదీ..విషయం! *