Others

ముచ్చటగా మూడోసారి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘చెన్న కేశవరెడ్డి’లో ఆయనతో తొలిసారి జోడీకట్టింది శ్రీయ. ఆ తర్వాత ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో రెండోసారి మెరిసింది. తాజాగా ముచ్చటగా మూడోసారి బాలకృష్ణ 101వ చిత్రం ‘పైసా వసూల్’లో నూ కనువిందు చేసింది. బాలయ్యతో మూడు సార్లు జోడీ కట్టారు కదా.. ఎలా వుంది? అని శ్రీయను కదిలిస్తే- ‘‘ఎన్ని చిత్రాలు చేసినా, ఎన్ని వైవిధ్యమైన పాత్రలు పోషించినా అభిమానులకు ఏదో ఒక కొత్త తరహా క్యారెక్టర్‌లో కనిపించాలని అనుకుంటా. అలాగే బాలయ్యతో చేసిన ప్రతీ చిత్రంలో నేను పోషించిన పాత్ర నాకు బాగా నచ్చిందే. తాజా చిత్రం ‘పైసా వసూల్’లో నేను జర్నలిస్ట్ పాత్రలో కనిపించాను. బాలయ్యతో నేను చేసిన మూడవ చిత్రమిది. వందకు పైగా చిత్రాల్లో నటించిన ఆయనతో సినిమాలు చేయడం నా అదృష్టం. పూరీ జగన్నాథ్ గొప్ప దర్శకుల్లో ఒకరు. చాలా సినిమాలకు నేను కొత్త దర్శకులతో కలిసి పనిచేశాను. అలా నేను చేసిన ప్రతీ సినిమా నాకు ఒక్కో అనుభూతిని మిగిల్చింది. అలాగే చాలా మంది నన్ను ‘నక్షత్రం’లో ప్రత్యేక పాటలో ఎందుకు నటించారని.. అందుకు కారణమేంటని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే నాకు ‘నక్షత్రం’ కథ చాలా బాగా నచ్చింది. అందుకే ప్రత్యేక పాటలో కనిపించడానికి ఒప్పుకున్నాను’’అంటూ ఎంతో హుషారుగా చెప్పుకొచ్చింది బ్యూటీ శ్రీయ. *