Others

పాత్రలలో వెరైటీ.. (శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ చిత్రంలో మహాశివుడి పాత్రలో చిరంజీవిని చూడండి. ఆ పాత్రలో చిరంజీవి చూడముచ్చటగా వున్నారు కదూ. అలా చిరంజీవి శివుడి పాత్రలలో రెండు చిత్రాలలో నటించి మెప్పించారు. ముఖ్యంగా శ్రీమంజునాథ చిత్రంలో ప్రధాన పాత్రగా కనపడి మరింత ఆకర్షించగలిగారు. చిరంజీవికి నటనలో శిక్షణ పొందినా, నృత్యాలలో కూడా మంచి ప్రావీణ్యత వుండటం వలన శివతాండవం దృశ్యాలలో మరింత రాణించగలిగారు. నటుడు బాలకృష్ణ కూడా శ్రీరామరాజ్యం, భైరవద్వీపం చిత్రాలలో తండ్రి ఎన్టీఆర్‌ని చూస్తున్న అనుభూతి కలిగించగలిగారు. అసలు అగ్రనటులు ఎన్.టి.ఆర్, అక్కినేని తమ కెరీర్‌లో దశాబ్దాలకుపైగా రాణించగలిగారంటే ఆ రోజుల్లో వారు ప్రతీ పాత్ర ఒక పరీక్షలా భావించి కేవలం సాంఘిక పాత్రలే కాకుండా పౌరాణిక, జానపద, చారిత్రాత్మక పాత్రలలో నటించటంవలన పాత్రల పట్ల మొనాటమీలా కాకుండా ప్రేక్షకులకు ఒకే పాత్రలోనే చూస్తున్నాం అనే విసుగెత్తకుండా అలరించగలుగుతున్నారు. నేటి తరం హీరోలు కూడా అగ్ర నటులను అనుసరించి సోషల్ కథాంశాలతోపాటు పౌరాణిక జానపద చారిత్రాత్మక పాత్రలలో కూడా నటించే ప్రయత్నం చేయటం వారి కెరీర్‌కు శ్రేయస్కరం. తెలుగు హీరోలలో ఎన్‌టిఆర్ కుటుంబంలోని నటులు కాకుండా మోహన్‌బాబు, సుమన్ కూడా ఇతర పాత్రలకు సరిపోతారు అని నిరూపించుకున్నారు. యువతరం హీరోలు కూడా రాబోయే చిత్రాలలో వెరైటీ పాత్రలలో నటించి మెప్పించగలరని, లేని పక్షంలో తెలుగు సినిమా హీరోయిన్‌లలాగా అచిరకాలంలోనే తెరమరుగయ్యే ప్రమాదం వుందని గమనిస్తే మంచిది!

-పర్చా శరత్‌కుమార్