Others

మహేష్‌కు విలనయ్యాడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ‘్భరత్ అను నేను..’ చిత్రంలో నటిస్తున్న మహేష్ బాబు తదుపరి చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్ ప్రారంభమైన ఈ చిత్రంలో మరో హీరో కూడా నటిస్తున్నాడట. అయితే ఆయన నెగిటివ్ పాత్రలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరంటే అల్లరి నరేష్? కామెడీ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న నరేష్‌కు ఈ మధ్య వరస పరాజయాలు టెన్షన్ పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కొత్త ప్రయోగం చేయడానికి రెడీ అయ్యాడట. అందుకనే ఈ పాత్రను చేసేందుకు ఒప్పుకున్నాడని వినికిడి. గతంలో కూడా ‘విశాఖ ఎక్స్‌ప్రెస్’ సినిమాలో నెగిటివ్ పాత్రలో అదరగొట్టాడు నరేష్. మొత్తానికి సూపర్‌స్టార్‌కు విలన్‌గా మారిన నరేష్ మరి ఎలా అదరగొడతాడో చూడాల్సిందే..! *