Others

శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నగారి ముందు నిలబడి వినయంగా రెండు చెవులూ మూసుకొని శివశివా అంటున్నట్టు కనిపిస్తున్న నటిని గుర్తుపట్టారా? అసలు ఈ సన్నివేశం చూస్తుంటే ఏమనిపిస్తోంది. ఇక్కడ అన్నగారి గెటప్‌లోనూ మార్పు కనిపిస్తోంది కదూ!
సస్పెన్స్ ఎందుకులెండి. సన్నివేశం తెలుసుకుంటే -చిత్రార్థం మీకే అర్థమవుతుంది. ఎన్టీఆర్ దర్శకత్వంలో నిర్మితమైన మొదటి మరియు ఆఖరి హిందీ చిత్రం బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఆ చిత్రం షూటింగ్ సమయంలో ఓ సన్నివేశం సందర్భంగా హిందీ నటి దీపికకు సూచనలిస్తూ ఆమె ముఖ కవళికలు గమనిస్తున్న ఎన్టీఆర్‌ను ఇక్కడ చూస్తున్నాం. మహానటుడి ముందు నిలబడి ఆయన వివరించిన సన్నివేశాన్ని అభినయించి చూపించటం అంటే -ఎంతటి నటికైనా వెన్నులో వొణుకు తప్పదుకదా!
చిత్రం ఏమంటే -ఎన్టీఆర్ రాజకీయ పార్టీ స్థాపించి ఎంతటి సంచలనం సృష్టించారో చరిత్రలో లెక్కలేనన్ని పేజీలు చెబుతూనే ఉన్నాయి. ఆయన ముందు బుడిబుడి అడుగులేసిన ఎందరో పరిశ్రమలో ఏస్థాయికి ఎదిగారో చూస్తూనే ఉన్నాం. ఇంతమందిలో -ఎన్టీఆర్ చివరి కోరికను నెరవేర్చేవాళ్లే లేరా? అనిపిస్తుంటుంది. విశ్వామిత్రుని చరిత్రను ఉత్తరాదివారికి గొప్పగా చూపించాలన్నది ఎన్టీఆర్ ఉద్దేశం. అందుకే -ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆ చిత్రాన్ని హిందీలోనూ రూపొందించారు. కానీ -అక్కడ విడుదల కాకుండానే ఆగిపోయింది. ఎందుకు, ఎలా? అన్నది మాత్రం అన్నగారి అభిమానులకు అర్ధంకాని మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉండిపోయింది.

-పర్చా శరత్‌కుమార్ 9849601717