Others

పూలరంగడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విడుదల: 24-11-1967
కథ-ముళ్ళపూడి వెంకటరమణ, సంగీతం-ఎస్.రాజేశ్వరరావు,
ఛాయాగ్రహణం- పి.ఎస్.సెల్వరాజ్, పాటలు-కొసరాజు, సి.నారాయణరెడ్డి, దాశరథి,
ఎడిటింగ్- టి.కృష్ణ,
స్టంట్స్- రాఘవులు,
కెమెరా- పాచూ,
కళ- జి.వి.సుబ్బారావు,
నృత్యం-తంగప్ప, కె.ఎస్.రెడ్డి,
నిర్మాత, డి.మధుసూదన్‌రావు
సహకార దర్శకుడు- చంద్రశేఖర్,
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు.

తొలుత కె.వి.రెడ్డి దర్శకత్వంలో ‘దొంగరాముడు’ చిత్ర నిర్మాణం ప్రారంభించిన అన్నపూర్ణ సంస్థకు, ఆ తరువాత చిత్రాలు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందాయి. ‘ఆత్మగౌరవం’ చిత్రానికి కె.విశ్వనాథ్ దర్శకత్వం నిర్వహించారు. ఆ తరువాత వీరు రూపొందించిన 12వ చిత్రం ‘పూలరంగడు’కు తిరిగి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం చేపట్టారు.
తొలుత గొల్లపూడి మారుతీరావు, డి. మధుసూదన్‌రావులు కలిసి అన్నయ్య ప్రధాన పాత్రగా ఒక కథ అనుకున్నారు. ఆ తరువాత, రచయిత ముళ్ళపూడి వెంకటరమణతో చర్చలు జరిపి పూర్తి రూపంలో కథను సిద్ధం చేశారు. దీనికి మాటలు వ్రాయడానికి ముళ్ళపూడివారు ఇష్టపడకపోవటంతో, పాఠకుల అభిమానం పొందిన ప్రముఖ నవలా రచయిత్రి ముప్పాళ్ళ రంగనాయకమ్మచే మాటలు వ్రాయించారు. వైజాగ్ స్వస్థలం అయిన రచయిత్రి 4, 5 సార్లు హైదరాబాద్ వచ్చి డైలాగులు పూర్తిచేశారు. అన్నపూర్ణ సంస్థ తొలి చిత్రంలో చెల్లెలు పాత్ర పోషించిన జమున, ఈ చిత్రంలో ఆయన సరసన హీరోయిన్‌గా నటించటం (12వ చిత్రంలో) విశేషం. ప్రముఖ నటి విజయనిర్మల ఎ.ఎన్.ఆర్ చెల్లెలిగా తొలిసారి అన్నపూర్ణ సంస్థలో ప్రవేశించారు.
నిర్మాత, డి.మధుసూదన్‌రావు సినిమా అనుకరణ చేసిన ఈ చిత్రానికి ముగ్గురు రచయితలు పనిచేయటం ఎన్నదగిన అంశం. కథ-ముళ్ళపూడి వెంకటరమణ, సంగీతం-ఎస్.రాజేశ్వరరావు, ఛాయాగ్రహణం- పి.ఎస్.సెల్వరాజ్, పాటలు-కొసరాజు, సి.నారాయణరెడ్డి, దాశరథి, ఎడిటింగ్- టి.కృష్ణ, స్టంట్స్- రాఘవులు, కెమెరా- పాచూ, కళ- జి.వి.సుబ్బారావు, నృత్యం-తంగప్ప, కె.ఎస్.రెడ్డి, సహకార దర్శకుడు- చంద్రశేఖర్, దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు.
ఫ్యాక్టరీ మేనేజర్‌గా పనిచేస్తున్న వీరయ్య (నాగయ్య) తల్లి లేని పిల్లలు రంగడు (ఎ.ఎన్.ఆర్), పద్మ (విజయనిర్మల)లను గారాబంగా పెంచుతున్నాడు. ఫ్యాక్టరీ యజమాని పురుషోత్తముని భాగస్తులు ధర్మారావు (గుమ్మడి), చలపతి (్భనుప్రకాష్) కుట్ర పన్ని విషం పెట్టి హత్య చేస్తారు. ఆ నేరం వీరయ్యమీదకు నెట్టడంతో వీరయ్యకు యావజ్జీవ కారాగారశిక్ష పడుతుంది. ఆ పిల్లలను పక్కింటి పోలీసు పున్నయ్య (అల్లు రామలింగయ్య), భార్య (రాధాకుమారి) చేరదీస్తారు. కాని ఆత్మాభిమానం గల రంగడు, జట్కా నడుపుతూ చెల్లెలిని స్కూల్లో చదివిస్తాడు. పద్మ కాలేజీలో చేరుతుంది. రంగడు, పక్కింటి వెంకటలక్ష్మి (జమున), గడ్డి కోసే యువతి ఒకరినొకరు ఇష్టపడతారు. చెల్లెలు పెళ్లి చేసే వారు పెళ్లాడాలని అనుకుంటారు. పురుషోత్తంగారి అబ్బాయి డాక్టరు ప్రసాద్ (శోభన్‌బాబు) ప్రేమించి, తల్లి అనుమతితో వివాహం చేసుకుంటాడు. ధర్మారావు కూతురు గీతాంజలి, చలపతి కుమారుడు బుజ్జి (పద్మనాభం) ప్రేమించుకుంటారు. ధర్మారావు భార్య బేబి (సూర్యకాంతం)కు ఇది ఇష్టముండదు. ఎంకి తమ్ముడు నరసింహం (చలం) పద్మమీద ఆశలు పెట్టుకుని, ఆమెకు పెళ్ళి జరగటంతో, ఆమె అత్తగారింటికి వెళ్లి, పద్మ తండ్రి ప్రసాద్ తండ్రిని హత్యచేసిన హంతకుడని తెలియజేయటంతో, రంగడి పెళ్లి నెపంతో గర్భవతియైన పద్మను పుట్టింటికి పంపివేస్తారు. విషయం తెలిసి నరసింహతో రంగడు ఘర్షణపడడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుశిక్ష విధిస్తారు. జైలులో రంగడు తన తండ్రి వీరయ్యను కలుసుకుని అతడు నిర్దోషి అని తెలుసుకుంటాడు. శిక్ష అనుభవించి బయటకు వచ్చి ఎంకి, నరసింహాల సాయంతో ధర్మారావు ఇంట పనివాడిగా ప్రవేశించి, హత్యా రహస్యాన్ని తెలుసుకుని, సాహసంతో రుజువులను కాపాడి పోలీసులకు ఇవ్వడంతో ధర్మారావు అరెస్టు కావడం, వీరయ్య నిర్దోషిగా బయటకు రావడం, రంగడు, ఎంకి, బుజ్జిల వివాహంతో, పద్మ ప్రసాద్‌ల కలయికతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
హీరో అక్కినేని రంగడుగా ఎంతో హుషారుగా, చైతన్యవంతంగా ఆకట్టుకునే నటన ప్రదర్శించారు. ఆత్మాభిమానం, చెల్లెలిపట్ల ఆప్యాయత, అభిమానం, పద్మ అత్తవారింట అణకువ, నెచ్చెలి వెంకటలక్ష్మితో హుషారు, చిలిపితనం, గుడిలో, బయట అల్లరిగా, ముఖ్యంగా తమాషాగా పెళ్లిచూపుల సన్నివేశంలో, జైల్లో మేనల్లుడు పుట్టాడని తెలిసినప్పుడు, నిర్దోషి అయిన తండ్రిని అనుమానించానని తెలిసినప్పటి భావోద్వేగాలు, ఎంతో సహజమైన భావాలను చూపటం అభినందనీయం.
ఇక హీరోయిన్ వెంకటలక్ష్మిగా గడుసుదనం, అమాయకత్వం, పట్టుదల లక్షణాలను హీరో తగ్గట్టు చిలిపితనం, బాధ్యత, పద్మ అత్తవారింటికి వెళ్లినపుడు తొలుత అమాయకంగా, ఆ తరువాత ధైర్యంగా మాట్లాడడం, బుర్రకథలో హీరోతో సమంగా నృత్యం, సినిమా టిక్కెట్టు కోసం పోటీ- ఇలా జమున సన్నివేశానుగుణమైన అభినివేశం చూపారు, ప్రేక్షకులను రంజింపచేశారు.
ఇక సోదరిగా, భర్తకు దూరమయిన భార్యగా ఎడబాటును, అటు అన్నతో, ఇటు భర్తతో సన్నివేశాలలో అమాయకమైన, ఒద్దిక కలిగిన యువతిగా అలరించారు.
ఈ చిత్రంలో చలపతిగా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్టేజీ ఆర్టిస్టు భానుప్రకాష్ నటించారు. ఈ చిత్రంలో చక్కని నటనను ప్రదర్శించి, ఆ తరువాత అన్నపూర్ణ వారి చిత్రాలన్నింటిలోనూ, ఇతర సం స్థల చిత్రాలలోనూ నటించారు. మిగిలిన కొన్ని పాత్రలను స్థానిక కళాకారులచే నటింపజేశారు.
ఇక దర్శకులు ఆదుర్తి సుబ్బారావు సన్నివేశాలను తనస్టయిల్‌లో చక్కగా రూపొందించారు. తొలుత జట్కా బండి తోలుతూ హీరో ప్రవేశం, ఆ తరువాత ఝాన్సీ పర్సు ఇప్పించటం ద్వారా హీరో నిజాయితీ ఎస్టాబ్లిష్ చేయటం, చెల్లెలును కాలేజీలో చేర్పించాక రాధాకుమారి ద్వారా రంగడి తండ్రి గతం, నరసింహ, ఎంకి సమక్షంలో చెప్పించటం, దాని ద్వారా నరసింహం, ప్రసాద్ తల్లికి అది వెల్లడి చేయటానికి మార్గంగా చూపటం, ఇక పద్మ, ప్రసాద్‌ల అనురాగం, సితార బహూకరణ, దాని స్వరాలు మొదలవగా పక్కన కొలనులో సితార ప్రతిబింబం మ్యూజిక్‌తో కారులో వెళ్లిన జంట సముద్ర తీరంలో చక్కని హమ్మింగ్‌తో గీతం సాగటం ‘చిగురులు వేసిన కలలన్నీ’ (సినారె రచన - గానం పి.సుశీల, కె.బి.కె.మోహన్‌రాజ్), మరొకసారి సితార గీతాంజలి వాయిస్తుండగా, ప్రసాద్ ఊహలో విజయనిర్మలను చూపటం, వారిరువురూ విడివిడిగా మధ్యలో బ్లాక్‌షాడోతో వారిరువురిని, బాబును, ఊయలను చూపడం, విడిగా అందంగా విజయనిర్మలను చూపటం, ప్రసాద్ రియాక్షన్స్ ‘నీవు రావు నిదుర రాదు’ (రచన- దాశరథి, గానం పి.సుశీల) వీణ పాటలకు అన్నపూర్ణ ప్రసిద్ధని, చిత్రీకరణలో వెరైటీని సితారపై అద్భుతంగా చూపటం ఆదుర్తివారికే చెల్లింది. టైటిల్ సాంగ్‌లో హీరో లక్షణాలను ఎలివేట్ చేయటం టైటిల్ జస్ట్ఫికేషన్ ‘పూలరంగడిగా వెలుగుమురా’ పాట చిత్రీకరణ పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించడం, ఇక చిత్రంలోని జైలు సన్నివేశాలకోసం పి.వి.నరసింహారావుగారి ద్వారా జైలు ఉన్నతాధికారులకు ఫోన్ చేయించి ముషీరాబాద్, చంచల్‌గూడ సెంట్రల్ జైళ్లలో చిత్రీకరణ జరిపించారు. సహజత్వానికి వారు చూపే శ్రద్ధకిది నిదర్శనం. జమున, అక్కినేనిలపై థియేటర్‌లోని ఓ యుగళగీతం, బ్లాక్ అండ్ వైట్‌ని తొలిసారి రంగు ల్లో చిత్రీకరించారు. ‘నీ జిలుగు పైట నీడలోన నన్ను నిలవనీ’ (సినారె, గానం- ఘంటసాల, సుశీల) సామాన్య దుస్తుల్లో వున్న నాయికా నాయకులు మోడరన్ దుస్తుల్లో కన్పించి అలరించటం ఓ చక్కని ఊహ.
ఈ చిత్రంలో ఇతర గీతాలు టైటిల్ సాంగ్ ‘నీతికి నిలబడి’ (రచన కొసరాజు, గానం ఘంటసాల), జమున, అక్కినేనిలపై యుగళగీతం ‘మిసమిసలాడే చినదానా’ ఆరుబయట ఏటి ఒడ్డున సాగుతుంది (రచన సినారె, గానం ఘంటసాల, సుశీల), చలం, అక్కినేని, జమునలపై బుర్రకథ ‘వినరా భారత వీరసోదరా విజయము’ (కొసరాజు రచన, గానం ఘంటసాల, పి.సుశీల), జైలులో నాగయ్య, ఎఎన్నార్ బృందంపై పాట ‘చిల్లర రాళ్ళకు మొక్కుతువుంటే’ (నాగయ్య, ఘంటసాల బృందం, రచన కొసరాజు, జమున, పద్మనాభంలపై హుషారైన గీతం ‘సిగ్గెందుకే పిల్లా’ (కొసరాజు, మాధవపెద్ది సత్యం గానం).
ఈ చిత్రం పట్ల నిర్మాత మధుసూదనరావుగారికి విపరీతమైన నమ్మకం. కానీ చాలామంది ఆ ఏడాది అక్కినేని నటించిన 4 చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. కనుక ఇది కూడా ఫ్లాప్ అవుతుందని అంచనా వేయటం, కొంతమంది రిపోర్టర్స్ కూడా పత్రికాముఖంగా వారి అభిప్రాయాలను వెల్లడించడం జరిగింది. కాని అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నిర్మాత, హీరోగార్ల నమ్మకాన్ని నిజం చేస్తూ ‘పూలరంగడు’ విజయం సాధించింది. రజతోత్సవం జరుపుకుంది.
ఈ చిత్రాన్ని ఉపరాష్టప్రతి వి.వి.గిరిగారు సతీసమేతంగా బెంగుళూరులో వీక్షించి అక్కినేనిని అభినందించటం విశేషం.
హైదరాబాద్ బసంత్ టాకీస్‌లో జరిగిన ఈ చిత్ర శతదినోత్సవ వేడుకలకు హిందీ నటుడు రాజేంద్రకుమార్ ముఖ్య అతిథిగా వచ్చి నటీనటులకు షీల్డులను బహూకరించారు.

-సి.వి.ఆర్.మాణిక్కేశ్వరి