Others

దయ్యం పట్టిందోచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిషకు దయ్యం పట్టిందో, దయ్యానే్న త్రిష పట్టిందో తెలీదుకానీ, అందమైన కథానాయిక పాత్రలకంటే ‘నాయకి’ పాత్రలకే ఎక్కువ మొగ్గు చూపుతోందట. ‘నాయకి’గా ద్విపాత్రల్ని అభినయిస్తున్న చెన్నయ్ సోయగం, తాజాగా పునర్జన్మల బ్యాక్‌డ్రాప్‌లో మరో హారర్ స్టోరీకి లైన్ క్లియర్ చేసిందని తమిళనాట మాట. ఈ కథను హారర్ అనలేంగానీ కారర్ అనొచ్చు అంటూ ఆమె ఫ్రెండ్సే ఫన్నీ చేస్తున్నార్ట. ఎందుకంటే -పునర్జన్మల కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతీకారం తీర్చుకునే పాత్రలో త్రిష కనిపించబోతుంది. గ్యాంగ్‌రేప్, మర్డర్‌కు గురైన అమ్మాయి మళ్లీ పుట్టి పగ తీర్చుకోవడమే స్టోరీ లైన్. ఆ పగను త్రిష ఎంత భయంకరంగా చూపిస్తుందో చూద్దాం.