Others

బిపాసా రీ ఎంట్రీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ డస్కీ బ్యూటీ బిపాసా బసు ఈ మధ్యకాలంలో సినిమాల్లో కనిపించడం మానేసింది. గతేడాది పెళ్లి చేసుకున్న ఈ భామకు అప్పటి నుంచి సిల్వర్ స్క్రీన్‌పై మెరవనేలేదు. అలాగని ఈమెకు ఏమీ నటనకు స్వస్తి పలకాలనే ఆలోచనలు కూడా లేవు. కానీ అవకాశాలు ఆమె చెంతకు చేరడం లేదంతే. పెళ్లి చేసుకున్న తర్వాత అవకాశాలు రావడం కాసింత కష్టమే. కానీ బాలీవుడ్‌లో అలాంటి పట్టింపులు అంతగా ఉండవు. అయతే ఆశ్చర్యకరంగా బిపాసాను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. జనాలు తనను మరచిపోకుండా ఉండడానికి ఏం చేయాలో బాగానే తెలుసుకుంది. అందుకే సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫొటోలను తెగ షేర్ చేసేస్తూ ఉంటుంది. తాజాగా గోవా వెళ్లిన ఈ బ్యూటీ అక్కడ స్విమ్మింగ్ చేస్తూ ఓ ఫొటో తీయించుకుని నెట్‌లో పెట్టేసింది. ప్రేమలోని లోతులను చూస్తున్నానంటూ క్యాప్షన్ పెట్టి అందరినీ ఆకర్షించింది. టాప్ యాంగిల్‌లోంచి తీసిన ఈ ఫొటో చూస్తే మైండ్ బ్లోయింగ్ అవాల్సిందే మరి. ఈ మధ్య కాలంలో తన భర్తతో కలిసి ఓ కండోమ్ యాడ్‌లో కూడా హాట్ హాట్‌గా కనిపించింది బిపాసా. అయినా.. తనకు అవకాశాలు ఇవ్వమని.. ఇస్తే ఏ రేంజ్ అందాలను అయినా ఆరబోసేందుకు రెడీ అని అంటోంది. దటీజ్.. బిపాసా!
*