Others

ఒక మనసు(నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూన్ 24, 2016న విడుదలైన ‘ఒక మనసు’ నాకు ఎంతగానో వచ్చింది. హృదయాన్ని మాటలతో సంగీతంతో తాకిడి చేసే సినిమా, సంగీత పరవశంలా హాయిగా సాగుతుంది. ఇందులో హీరోయిన్‌గా నటించిన నిహారిక చిన్న చిన్న మాటలతో, ప్రేమతో పలికిన హావభావాలకి ఫ్లాట్ అయిపోవచ్చు ఎవరైనా. చివరి సన్నివేశంలో ఎవరైనా కంటతడి పెట్టాల్సిందే. దర్శకుడు రామరాజు తెరకెక్కించిన విధానం అద్భుతం. హీరోగా నాగశౌర్యను ఒక మెట్టు ఎక్కించిన సినిమా.
ప్రేమలో వున్న మత్తు, గమ్మత్తు, బంధం అనుబంధం, చిలిపి సరదాలు, కోపాలు, ఆవేశాలు, అభిమానం, త్యాగం- ఈ సినిమాలో కనిపిస్తుంది. ప్రేమికులు తప్పకుండా చూడాల్సిన సినిమా. నిజాయితీ ఉన్న ప్రేమ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? త్యాగం ఎలా నిరూపించుకుంటుంది అనే విషయం పర్‌ఫెక్ట్‌గా వుంటుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు కొత్త లోకంలో ఉన్నట్లు ఉంది. ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ పాటలు, మాటలు. ‘ఓ మనసా చేరువుగా’, ‘నిన్ను లేనంతగా’, ‘ఏమిటో ఈ క్షణం’ పాటలు ఆణిముత్యాలు. కమర్షియల్ ప్రేమ సినిమాలకు ఈ సినిమా చాలా భిన్నం.
‘నీ మీద ప్రేమ చావదు
ఇంకొకరిమీద ప్రేమ పుట్టదు
‘ప్రేమకు చావు లేదంటారుకదా..
అలాంటప్పుడు చచ్చేంత ప్రేమ ఎలా పుడుతుంది’
‘కనులకెంత కమనీయమో కదా మన జంట
ముచ్చటపడి ఆ దేవుడు మళ్లీ మళ్లీ జత చేస్తాడనుకుంటా.. ఇంకా ఎన్నో మాటలు ప్రేమను తెలియపరుస్తాయి. ఈ సినిమాలో సంధ్య పాత్రలో న్యాయం ఉంటుంది. సూర్య పాత్రలో న్యాయం ఉంటుంది. ఇలాంటి మంచి ప్రేమ వున్న సినిమాని అందించిన చిత్ర యూనిట్‌కి ధన్యవాదాలు.

-నల్లపాటి సురేందర్, విశాఖపట్నం