Others

నాకు నచ్చిన పాట--మనసుగతి ఇంతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసుగతి ఇంతే/ మనిషి బ్రతుకింతే/ మనసున్న మనిషికీ/ సుఖము లేదంతే!. రామానాయుడి ‘ప్రేమనగర్’ కోసం ఆచార్య ఆత్రేయ అందించిన పాట ఇది. మామ (కెవి మహదేవన్) సంగీత సారథ్యంలో ఘంటసాల గళం, అక్కినేని అభినయం కలగలిపి నూటికి నూరుపాళ్లు నిండుతనం ఆపాదించుకున్న పాట. ఈ పాట నాకు ప్రాణం.
‘ఒకరికిస్తే మరలి రాదు/ ఓడిపోతే మరిచిపోదు/ గాయమైతే మానిపోదు/ పగిలిపోతే అతుకుపడదు’ అన్నారు ఆత్రేయ. ఇది చాలు -ఆయనను గేయ రచయిత అనడంకంటే, జీవితాన్ని ఔపోసన పట్టిన తత్వవేత్త అనడానికి. ఆత్రేయ కలంనుంచి జాలువారిన తెలుగు పదాలు నిజంగా అమృత గుళికలు. ఆయన భావ ప్రకటనకు బతుకే కొలమానం అనిపిస్తుంది. ఈ పాటకు సంబంధించి ఆత్రేయకు దక్కిన పారితోషికం ఎంత ఉండి ఉంటుందో కానీ --కోటి కోహినూర్‌లు కుమ్మరించినా ఈ పాట గోటికి సరిపోదన్నది నిజంగా నిజం. ‘అంతా మట్టేనని తెలుసు/ అదీ ఒక మాయేనని తెలుసు/ తెలీసి వలచీ విలపించుటలో/ తీయదనం ఎవరికి తెలుసు’. అసలెలా తట్టిందయ్యా నీకు ఇలా రాయాలని -అని ఆత్రేయనే అడగాలి. అంత గొప్ప భావనను ఇంత కమ్మగా ఎలా ట్యూన్ చేయగలిగావయ్యా అని మామనూ ప్రశ్నించాలి. సరే, మామ ట్యూన్ చేశాడనుకో. అంతలా పాడేశావేంటయ్యా బాబూ అని ఘంటసాలనూ నిలదీయాలి. వీటన్నింటికీ న్యాయం చేయగల నటన నీకెవరిచ్చారయ్యా అని అక్కినేనినీ ఆరాతీయాలి. ‘మరుజన్మ వున్నదో లేదో/ ఈ మమతలప్పుడేమవుతాయో/ మనిషికి మనసే తీరని శిక్షా/ దేవుడిలా తీర్చుకున్నాడు కక్షా’. అంతులేని ఆవేదన గురించి ఏం చెప్పాలి? అంతకుమించి ఆత్రేయ గురించి ఏం చెప్పుకోవాలి. ఏం చెప్పినా, చెప్పాలనుకున్నా ఎంతొకొంత తక్కువైపోదూ! అందుకే ఈ పాటంటే చాలా ఇష్టం. ఆత్రేయ, మహదేవన్, ఘంటసాల, అక్కినేనిల అద్భుత ప్రతిభా పాటవాలకు తారాస్థాయి నిదర్శనం ఈ పాట. ఎన్ని తరాలకైనా చిరస్థాయిగా నిలిచివుండే ఆణిముత్యం ఈ తత్వగీతం.

***
వెనె్నల రచయితలకు
సూచన

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.
ప కొత్త సినిమాలపై సమీక్షలు రాయాలనుకున్న ఔత్సాహికులు ముందుగా ఒకటి రెండు సమీక్షలు పరిశీలన కోసం రాసి పంపితే, పరిశీలించగలం.
ప తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే కొత్తసినిమాలను పరిశీలించే ఆసక్తి వున్నవారు, సంబంధిత వ్యాసాలు పంపితే అవీ ప్రచురణార్హమే.
ప కొత్త హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వ్యాసాలకు కూడా స్వాగతం.
ప ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాని, అపురూప చిత్రాలువుంటే పంపొచ్చు.
ప రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో vennela@deccanmail.comకు మెయల్ చేయగలరు.
ప ప్రచురించిన (మీ వ్యూస్ మినహా) ప్రతి వ్యాసానికి పారితోషికం వుంటుంది.

మా చిరునామా :
ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03

-కర్రి శ్రీనివాసరావు, విశాఖపట్నం