Others

నాకు నచ్చిన సినిమా (అహ.. నా పెళ్లంట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ్వించి నవ్వించీ నవ్వు భోగాన్ని అనుభవించి దర్శకుడు జంధ్యాల. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో -జంధ్యాల అంతటి గొప్ప చిత్రం ‘అహ..నా పెళ్ళంట’. విజయవారి మాయాబజార్‌లోని అహ నా పెళ్ళంట ట్యూన్‌ను వారి అనుమతితో ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండుగా వాడుకున్నారు. సత్యనారాయణ (నూతన్‌ప్రసాద్) ఓ ఇండస్ట్రియలిస్టు. ఆయన పుత్రరత్నం కృష్ణమూర్తి (రాజేంద్రప్రసాద్) ఒక పార్టీలో పద్మ (రజని)ను చూసి మనసు పారేసుకుంటాడు. పెళ్ళి చేసుకొంటానని తీర్మానించుకొంటాడు. తన తండ్రి అనుమతితో తనను పెళ్లి చేసుకోమంటుంది పద్మ. ఆ అమ్మాయి తండ్రి లక్ష్మీపతి (కోట శ్రీనివాసరావు) పరమ పిసినారి. గతిలేక అతనిదగ్గర అరగుండు (బ్రహ్మానందం) వెట్టిచాకిరీ చేస్తుంటాడు. ఈ క్యారెక్టర్ల పరిచయంతోనే జంధ్యాల మార్క్ చాలెంజ్ ఒకటి స్క్రీన్ మీదకొస్తుంది. అదేంటంటే -ఆస్తిపరుడిని అల్లుడిని చేసుకోవాల్సి వస్తు లక్ష్మీపతి ఎగిరి గంతేస్తాడని, అలాకాకుండా అణా కాణీ లేని అనామక కుర్రాడిగా పెళ్లికి లక్ష్మీపతిని ఒప్పించాలని చాలెంజ్ విసురుతాడు. తప్పని పరిస్థితుల్లో తండ్రి చాలెంజ్‌ను స్వీకరించిన కృష్ణమూర్తి -లక్ష్మీపతి దగ్గరకు ఎలా వెళ్లాడు. అతన్ని మించిన పరమ పిసినారి అవతారం ఎత్తి ఎలా బుట్టలో వేసుకున్నాడు. లక్ష్మీపతిని ఎన్ని తిప్పలు పెట్టాడు. లక్ష్మీపతి కొడుకు ప్రేమను ఎలా గట్టెక్కించాడు. పద్మ ప్రేమను పొందుతూనే -చివరిలో నాటకం బెడిసికొట్టి రివర్సయిన లక్ష్మీపతిని ఎలా లొంగతీసుకున్నాడన్నదే అసలు కథ. కడుపుబ్బ నవ్వించే జంధ్యాల స్టయిల్ సున్నితమైన హాస్య సన్నివేశాలతో యమ సరదాగా సాగిపోతుందీ చిత్రం. సినిమా కామెడీ అంటే వెకిలి చేష్టలుకాదని, మేనరిజమ్స్ నుంచే క్లాసిక్ కామెడీ పుట్టించొచ్చుని తెలియజెప్పే చిత్రమిది. ఆదివిష్ణుగారి సత్యంగారిల్లు ఆధారంగా నిర్మితమైన చిత్రమిది. రమేష్‌నాయుడి సంగీత సారథ్యంలో వినసొంపైన సందర్భోచిత పాటలూ ఈ చిత్రానికి కుదిరాయి. వినోదాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం నాకు నచ్చింది. చాలామందికే నచ్చింది. మీకూ నచ్చే ఉంటుంది.

-పి. శేషగిరిరావు, విశాఖపట్నం