Others

డైరెక్టర్స్ ఛాయిస్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-శేఖర్ సూరి

ఏ ఫిల్మ్ బై అరవింద్‌తో థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచాడు శేఖర్ సూరి. త్రీ, అరవింద్-2, అదృష్టంలాంటి చిత్రాలను రూపొందించిన ఆయన, కొత్త తరహా థీమ్స్‌నే ఇష్టపడతానని చెబుతున్నాడు.
శేఖర్ సూరితో ఈ వారం చిట్‌చాట్!
మీ నేపథ్యం?
-పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా తణులో అయినా, పెరిగింది చదివింది హైదరాబాద్‌లోనే. గ్రాడ్యుయేషన్ చేశా.
దర్శకుడిగా ఆలోచన?
-ఆ లైన్‌లో ఇష్టం ఫస్ట్‌నుంచీ ఉండేది. అప్పట్లో తమస్ సీరియల్ వచ్చేది. గోవింద్ నిహాలని దర్శకుడు. ఆ సీరియల్ బాగా ప్రభావం చూపించింది. గ్రాడ్యుయేషన్ తరువాత దర్శకుడు కావాలని నిర్ణయించుకున్నా.
తొలి అవకాశం?
-నా స్నేహితుడు ‘చాంప్’ తరుణ్‌ను పరిచయం చేశాడు. ఆయన నా కథ విని సూపర్‌గుడ్ సంస్థకు పరిచయం చేశారు. అలా నా మాతృ సంస్థ సూపర్‌గుడ్, ప్రోత్సహించిన హీరో తరుణ్, రికమెండ్ చేసింది చాంప్.
నచ్చిన జోనర్?
-కొత్త థీమ్స్ ఇష్టం. యాక్షన్, కామెడీ, థ్రిల్లర్, హారర్‌లాంటివన్నీ ఇష్టమే. వీటిలో కొత్తదనానికి ప్రయత్నిస్తా! ఒక చిత్రం హిట్టయితే అలాంటివే తియ్యమంటారు కనుక థ్రిల్లర్స్ చేశా.
హారర్, లవ్ జోనర్స్‌పై అభిప్రాయం?
-లవ్ స్టోరీలు పరిశ్రమ పుట్టినప్పటినుంచి ఉన్నవే! అవి ఆడుతూనే ఉంటాయి. ప్రతి జోనర్‌లో చిత్రాలు రావాలి. అలా హారర్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా వస్తే సంతోషమే! రామ్‌గోపాల్‌వర్మ ‘రాత్రి’నుండి హారర్ జోనర్స్‌లో ఎక్కువగా సినిమాలు వస్తున్నాయి.
నెక్స్ట్ ప్రాజెక్టులు?
-తెలుగులో ‘డాక్టర్ చక్రవర్తి’ అనే చిత్రం పూర్తి చేశా. పోస్ట్ ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి. హిందీలో ‘గన్స్ ఆఫ్ బనారస్’ రూపొందుతోంది.
దర్శకుడంటే?
-అది ఇప్పటికీ నాకు తెలీదు. ఇంకా నేర్చుకుంటున్నా. ఓ కథను అద్భుతంగా సెల్యూలాయిడ్‌పై చెప్పగలవాడు అనుకుంటాను.

శేఖర్