Others

మైమరపించే మాయాజాలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లు కట్టుకోవాలంటేనే ఎన్నోరకాల ఆలోచనలు చేస్తాం. ఎందరో అనుభవజ్ఞుల్ని, ఇంజనీర్లను కలుస్తాం. కడుతున్నప్పుడు కొంచెం తేడా అనిపిస్తే కాస్త మార్పుచేర్పులు చేసి నచ్చినట్టు డిజైన్ చేసుకుంటాం. ఇంకా ఇంటీరియర్ విషయంలోనయితే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఒకటికి రెండుసార్లు అటునుంచి ఇటు, ఇటునుంచి అటు సామాన్లని మారుస్తుంటాం. ఒక్కొక్కసారి మనం వేరేవాళ్ల ఇళ్లకు వెళ్లినపుడు అక్కడివారి ఇంటీరియర్ డెకరేషన్ చూసి అలాగే ఉండాలనుకుంటాం. అది కేవలం మనం ఉండే ఇల్లు మాత్రమే. కాకపోతే ఎవరయినా నలుగురు బంధువులు, తెలిసినవాళ్లు వస్తారు అంతే, ఇక మరి సినిమాల్లోని సెట్స్ గురించి చెప్పాలంటే ఆర్ట్ డైరెక్టర్స్ ఎంత తర్జనభర్జనలు పడాల్సి వుంటుందో చెప్పవీలుకాదు. సినిమా అంత ఒక భాగమయితే అందులో సెట్స్, ఇంటిరీయర్ డెకరేషన్ మరొక భాగం. పెయింటింగ్స్, ఫొటోగ్రఫీ కూడా ఒక భాగమే. సహజాన్ని తలపించాలి పెయింటింగ్స్. అలా ఉంటేనే ప్రేక్షకులను, చూపరులను ఆకట్టుకుంటాయి. కొన్ని కొన్ని పెయింటింగ్స్ అయితే లక్షల్లో డిమాండ్ చేస్తాయి. పోటీపడి మరీ అత్యధిక ధరలకు ఇష్టంతో కొనుక్కొని దక్కించుకునే వారిని మనం చూస్తూనే ఉన్నాం. అంటే అందులో ఎంతో కళాత్మకశక్తి ఇమిడి వుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక కొంతమంది తీసే ఫొటోలను చూసినట్లయితే ఇప్పుడే కళ్లముందు కదలాడుతున్నట్లుగా ఉంటాయి. అలాంటి ఫొటోలు, పెయింటింగ్స్‌కు ఎన్నో బహుమతులు పొందినవారున్నారు.
ఇక చలనచిత్ర రంగం విషయానికొస్తే ప్రతీ అంశం కథతో ముడిపడి ఉంటాయి. కథ చెప్తుంటూనే సెట్స్ కళ్లముందు కనబడాలి. దర్శకుడి మనసులో ఉన్న విధంగా కథకు తగినట్లుగా సెట్టింగ్స్, ఇంటీరియర్ డెకరేషన్స్ ఉండాలి. లేకపోయినట్లయితే కథ ఒక రకంగా, సీనరీ ఒక రకంగా తయారయిపోతుంది. సినిమాలోని కథ, పాటలు, మాటలు, కొరియోగ్రఫీ లాంటి వాటిలో ఏ కొంత పొరపాటు జరిగినప్పటికీ దాన్ని గమనించటానికి కాస్త సమయం పడ్తుంది. అదికూడా అందరికీ తెలియదు. కానీ సెట్స్‌లో, ఇంటీరియర్స్‌లో తేడా కనిపించినట్లయితే మొదటికే మోసం వస్తుంది. ఎలాగంటే సినిమాలు కాస్త సహజత్వానికి దగ్గరగా, కొంచెం హైలైట్ చేసి తీయాల్సి వుంటుంది. అంటే చరిత్రలో జరిగిన సంఘటనలతో, ప్రస్తుతం ఇటీవల కాలంలోమన కండ్లముందు జరుగుతున్నటువంటి విషయాలను సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేస్తారు దర్శక, నిర్మాతలు. అలాంటప్పుడు ఆ కథలకు సంబంధించిన విషయ పరిజ్ఞానంతోపాటు, ప్రదేశాలు, నిర్మాణాలు, అక్కడి వాతావరణ పరిస్థితులు, జీవన విధానం అన్నింటిపై ముందుగా అవలోకనం చేసుకోవాలి. అప్పుడే దర్శకులు వారు దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి సంబంధించిన కథ, పాత్రలు, నిర్మాణాలు వాటిపై ఆర్ట్ డైరెక్టర్లకు క్లుప్తంగా కళ్లకు కట్టినట్లు చెప్పగల్గుతారు. అంటే దర్శకులు ఆ పరిసరాలను ముందే వారి మనసులో సెట్స్ నిర్మించుకుంటారన్నమాట. దర్శకుల మనసులో వారు తీయాలనుకున్న చిత్రానికి సంబంధించి సెట్స్, అలంకరణలు ఎలా వుండాలో ఆర్ట్ డైరెక్టర్స్‌తో వేయించుకుంటారు.
సినిమా నిర్మాణంలో కొన్ని సీన్లు నేచురల్‌గా ఉన్నది ఉన్నట్లుగానే తీస్తారు దర్శకులు. కొన్ని సీన్లు కొన్ని కొన్ని లొకేషన్స్‌నుబట్టి మార్చాల్సి వుంటుంది. కొన్ని సీన్లు రాత్రివేళల్లో తీస్తుంటారు. రాత్రిపూట సీన్లు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంటుంది. లైటింగ్ విషయంలో జాగ్రత్తగా వుండాలి. ఇక మధ్యాహ్నం, తెల్లవారుజామున తీసే సీన్లలో నేచురాలిటీ ఉట్టిపడుతుంది. కాకపోతే ఆ సినిమాకు పనిచేసే వారంతా హీరో, హీరోయిన్లు, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు, దర్శకులు, కెమెరామెన్స్, మొదలైనవారందరికీ అంత చీకట్లో సెట్స్ దగ్గరకి వెళ్లి పనిచేయాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఆ సీన్లు, ఆ టైంలో తీసే బిట్స్ చిత్రానికి అవసరం ఉంటుంది. గత నాలుగైదు దశాబ్దాల క్రితం ఇప్పుడున్నంత టెక్నాలజీ కానీ, రవాణా సౌకర్యాలు గానీ, మ్యాన్ పవర్ కానీ చాలా తక్కువే. అయినప్పటికీ ఆ రోజుల్లో పౌరాణిక సినిమాలకు సెట్టింగ్స్ భారీగానే ఉన్నాయి. ఇప్పటి టెక్నాలజీని తలపించే సెట్స్, ఇంటీరియర్ డెకరేషన్స్ ఆరోజుల్లోనే తలపించాయి. కాస్త టెక్నాలజీ, మ్యాన్‌పవర్ తక్కువగా ఉండడంవల్ల ఆలస్యమయ్యేది. ఇప్పుడు కొన్ని పౌరాణిక చిత్రాలకు, బాలీవుడ్ లాంటి కథలు తీసే చిత్రాలకు, రజనీకాంత్ నటించిన రోబో లాంటి సినిమాలకు, ఇక పౌరాణిక చిత్రాలకు సంబంధించి చెప్పుకున్నట్లయితే ప్రభాస్ నటించిన బాహుబలి-1, బాహుబలి-2, రుద్రమదేవి, భాగమతి, అంతకుముందు వచ్చిన జగదేకవీరుడు - అతిలోక సుందరి, శ్రీరామరాజ్యం, అన్నమయ్య మొదలయిన సినిమాలకు సెట్టింగులు భారీఎత్తున వేయడం జరిగింది. నెలలకునెలల రోజులుకూడా సెట్స్ వేసిన చిత్రాలు ఉన్నాయి. ఎందుకంటే నిర్మాణాలు, ఇంటీరియర్స్ డెకరేషన్స్ చిత్రాలకు ప్రాణంపోస్తాయి. సెట్టింగ్స్ వేయడమంటే ఏదో మనం ఇల్లు నిర్మించున్నట్టు, కొత్తగా ఇష్టం వచ్చినట్లు వేసుకునేవి కావు. కథకు, కథలోని పాత్రలకు, చరిత్రకు పోలి ఉండాలి. లేకుంటే సినిమా అంతా డమీ అయిపోతుంది. పౌరాణిక చిత్రాలు, రాజుల కాలంలో వారి పాలనలో వ్యవస్థ ఎలా వుండేది, నివసించే ఇండ్లుకానీ, పరిపాలనా భవనాలు కానీ ఎలా ఉన్నాయో అదే విధంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతీ విషయం, ప్రతీ సంఘటనకు రికార్డులున్నాయి. ఒక సినిమాలో సెట్స్ తప్పుగా వేసారు, ఆ కాలంలో ఇంతటి సౌకర్యాలు లేనప్పటికీ ఇలా ఎలా నిర్మాణాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రేక్షకులకు ఆ రికార్డులను పరిశీలిస్తే కనుక ఇట్టే అర్ధమయిపోతాయి. కాబట్టి కథను రాసేవారు, దర్శకులు సెట్స్ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తారు. లేకుంటే ప్రేక్షకులను మభ్యపెట్టి ఏది తెలిసినా, తెలియకున్నా చిత్ర నిర్మాణాలు చేస్తూ జనాలను అజ్ఞానులుగా చూస్తున్నారని ప్రేక్షకుల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఏదయినా ఒక దేవుడి గురించి కానీ, ఒక దేవాలయం గురించి కానీ చిత్రం నిర్మించాలంటే దానికి సంబంధించిన చరిత్రను పుస్తకాల ద్వారా చదివి తెలుసుకున్నప్పటికినీ పురావస్తుశాఖ వారిని, ఎండోమెంట్ వారిని, ఆధ్యాత్మికవేత్తలను, ప్రాంతీయులను పూర్తిగా తెలుసుకొని చేస్తేనే ఆ చిత్రం ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్‌కి గురికాదు. లేకపోయినట్లయితే చరిత్రను, ఆ దేవుడు, దేవాలయాలను తప్పుదారి పట్టించినట్లవుతుంది. తద్వారా మతాలు, జాతుల వారి మధ్య చిచ్చు రేగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదేమయినా చరిత్రను నీరుగార్చే ప్రయత్నం చేయకూడదు. చిత్రాలు నిర్మించడానికి ఒక్కొక్కసారి సహజంగా ఉన్న ప్రాంతాలు, ప్రదేశాల్లోనే తీసే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సెట్స్ మధ్య నిర్మించాల్సి వుంటుంది. అప్పుడు అలాంటి ప్రదేశాల మీద పూర్తి అవగాహన, రీసెర్చ్ చేసినంత గట్టిగా కష్టపడాల్సి వుంటుంది. ఏదో ప్రపంచంలోని అన్నింటి గురించిన అవగాహన, ఆలోచన ప్రేక్షకులకు ఉంటుందా అనే ఆలోచనతో చిత్రాలు నిర్మించినట్లయితే జ్ఞానానే్న ప్రక్కదారి పట్టించినట్లవుతుంది. సెట్స్‌లో రియాలిటీ వుండేలా నిర్మిస్తారు. ఒక చిత్రానికి సంబంధించి ఒక బిల్డింగ్ గానీ (ఇల్లు), కార్యాలయం, అండర్‌గ్రౌండ్ ఇంకా ఏవయినాసరే సినిమా నిర్మాణం మొదలయినప్పట్నుండి క్లైమాక్స్ వరకు శిలలా, శిల్పంలా ఉండాల్సిందే మరి. అలా ఉండాలంటే ఆర్ట్ డైరెక్టర్లు ఎంత కష్టపడి పనిచేయాల్సి వుంటుందో ఊహకి అందనే అందదు. ఒక్కొక్కసారి అవుట్‌డోర్ షూటింగ్‌లో కూడా కథకు దగ్గరగా ఉండేటట్లు ఒకట్రెండు సెట్స్ నిర్మించుకోవాల్సి వుంటుంది. స్టూడియోలో అయితే సెట్స్ నిర్మించుకోవచ్చు. కానీ బాహ్యప్రపంచంలో ఎలా సాధ్యం? అయినప్పటికీ వాతావరణ పరిస్థితులు, సెక్యూరిటీ సమస్యలు ఉన్నప్పటికీ అలాంటి సెట్స్ తప్పదు. సెట్స్ వేయడానికే చాలావరకు నిర్మాతకు ఖర్చు విపరీతంగా సొమ్ములు వదులుతాయని చెప్పవచ్చు. మరి అంత ఖర్చు ఎందుకంటే, అలా సెట్స్‌లేకపోతే కనుక సహజత్వం కనిపించదు మరి. ఎన్ని లక్షలు, కోట్లు ఖర్చయినా కూడా మళ్లీ ఆ సెట్స్ దేనికీ పనికిరావు. సెట్స్ వేయాలంటే చరిత్రను చదివి తెలుసుకోవచ్చు. అలాంటి సెట్స్‌ను ఆ సెట్స్‌కు ఎంత స్థలమయితే సరిపోతుందో అక్కడ వేసుకోగల్గుతారు. కానీ ఆ నిర్మాణాల్లో ఉపయోగించే ప్రతీ వస్తువుకూడా ఆ కాలంనాటి వాతావరణాన్ని తలపించాలి. ఎంత కష్టం? పాడుపడిన బంగ్లాలో తీసేటటువంటి సీన్లలో బిల్డింగ్ అంతాకూడా బూజుపట్టి ఉంటుంది. అలా తీయాలంటే ఎన్ని గట్స్ ఉండాలి? అలాంటి సహజత్వం కన్పించకపోతే సినిమాలో లూప్‌హోల్స్ వెతుకుతారు ప్రేక్షకులు. కాబట్టి ఎంత సూక్ష్మదృష్టితో చూస్తే, ఎంత నిశితంగా చూస్తే అలాంటి ఆలోచనలు రావాలి? కొన్ని కొన్ని సినిమాల్లో పల్లెటూర్లు, పట్టణాలు, కొండలు, కోనలు, వాగులు, వంకలు, సముద్రాలు వగైరా సహజంగా ఉన్నదగ్గరే సినిమాలు నిర్మిస్తారు. మరి వాటిని కృత్రిమంగా నిర్మాణం చేయాలంటే పల్లెటూర్ల పరిసరాలు, వాగుల పక్కన ఉండేటటువంటి చెట్లు, పుట్టలు, అడవులు ఎంత నిష్ణాతులయితే ఇలాంటి సినిమాలకు పనిచేస్తారు? నాలుగైదు దశాబ్దాల క్రితం నుండి ప్రస్తుతం వరకు అన్ని సెట్సూ మ్యాన్యువల్‌గా వేసినవే. కాకపోతే ఇప్పుడు కంప్యూటర్సు, టెక్నాలజీ, గ్రాఫిక్స్ పుణ్యమాని కాస్త తొందరగా అవుతున్నాయి. అప్పుడేమో టెక్నాలజీ, మ్యాన్‌పవర్ తక్కువగా ఉండటంవల్ల కాస్త చిత్ర నిర్మాణాలు ఆలస్యమయ్యేవి. అప్పుడయినా, ఇప్పుడయినా మనిషి శ్రమలేనిది, చెమట రాకుండానే, కష్టం లేకుండానే, దీర్ఘదృష్టి లేకుండానే ఇదేమీ సాధ్యం కాదని తెలుసు. ఇండ్లుగానీ, కార్యాలయాలు గానీ, మహేష్‌బాబు నటించిన సినిమాలోని మధురైలోని ‘మధుర మీనాక్షి’ మన వారి ఆలయ సెట్టింగ్స్ కానీ ఎంత సహజత్వాన్ని చూపించాయి. అంతటి సహజత్వం సాధ్యంకావడానికి ఎంత కృషి, కసి ఉండాలి ఆర్ట్ డైరెక్టర్స్‌కి. లొకేషన్ సెట్టింగ్స్, ఇంటీరియర్ డెకరేషన్స్ చేయాలంటే ఎంతో సూక్ష్మ దృష్టి, కళాత్మక దృష్టి ఉండాలి. సినిమాలకు ప్రాణం లొకేషన్స్, సెట్టింగ్స్. అలాంటి లొకేషన్స్, సెట్టింగ్స్ వాతావరణంతో, ప్రకృతితో, పరిసరాలతో, జనుల జీవన విధానాలతో ముడిపడి ఉంటాయి. అలాంటి ఆర్ట్ డైరెక్టర్ల సూక్ష్మమైన దృష్టి చాలా గొప్పది.

-శ్రీనివాస్ పర్వతాల