Others

అమీ.. తుమీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చిన బ్రిటీష్ బ్యూటీ అమీ జాక్సన్‌కు ఇప్పుడు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ‘మదరాసు పట్టణం’తో పరిచయమైన ఆమె ఇటీవలే విడుదలై ‘ఐ’ చిత్రంతో మంచి గుర్తింపు పొందింది. తెలుగులోనూ నటించాలన్న ఆమె కలలు ఒక్కసారిగా ఫలించే అవకాశాలొచ్చాయ. ‘ఎవడు’ చిత్రంలో నటించాక అనేక అవకాశాలు వచ్చినా, దర్శకుడికి ఇచ్చిన మాట ప్రకారం ఆ అవకాశాలను వినియోగించుకోలేకపోయింది. ప్రస్తుతం అమీ జాక్సన్, రజనీకాంత్ -శంకర్‌ల కాంబినేషన్‌లో వస్తున్న ‘రోబో-2’ చిత్రంలో నటిస్తోంది. ప్రభాస్ బాహుబలి చూశాక ఆయనతో నటించాలన్న కోరికను బైటపెట్టిన అమీకి ఆ అదృష్టం కూడా తలుపు తట్టింది. తన డ్రీమ్‌ను నెరవేర్చుకోవడానికి ఇదే మంచి సమయమని గ్న్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. అదేవిధంగా లింగుస్వామి దర్శకత్వంలో అల్లు అర్జున్ చిత్రంలోనూ అమీ జాక్సనే కథానాయికట. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి అవకాశాలను అందిపుచ్చుకుని ఇక్కడి హీరోయిన్లకు సవాల్ విసురుతోంది అమీ జాక్సన్.