Others

ప్రత్యేక సాంగ్‌లో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య ప్రత్యేక పాటల్లో (ఐటెం సాంగ్స్)లో కూడా స్టార్ హీరోయిన్స్ చిందులేస్తూ ప్రేక్షకుల్లో క్రేజ్‌ని ఇటు డబ్బును బాగానే సంపాదిస్తున్నారు. ఒకప్పుడు ఐటెం సాంగ్స్ అంటే ప్రత్యేక హీరోయిన్స్ ఉండేవాళ్లు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఐటెం సాంగ్ అంటే క్రేజీ హీరోయిన్‌తో చేయిస్తే ఆ సినిమాకు మరికొంత మైలేజ్ పెంచినట్టు ఉంటుందని భావించి వాళ్లతో ఈ సాంగ్స్ చేయిస్తున్నారు. ఇక బాలీవుడ్‌లో అయితే ఈ సాంగ్స్‌లో స్టార్ హీరోయిన్స్ మాత్రమే చేస్తారు. ఇప్పుడు సౌత్‌లో కూడా అదే ట్రెండ్ నడుస్తోంది. తాజాగా రామ్‌చరణ్ బోయపాటి హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ప్రత్యేక సాంగ్‌లో చేయడానికి తమన్నా ఓకె చెప్పినట్టు టాక్. ఇప్పటికే ఎన్టీఆర్ జైలవకుశ సినిమాలో స్వింగ్ జరా.. స్వింగ్ జరా అంటూ ఓ రేంజ్‌లో ఊపేసిన తమన్నా మంచి డాన్సర్ అన్న విషయం అందరికీ తెలుసు. తాజాగా ఈ అమ్మడు చరణ్ సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేస్తోంది. ప్రస్తుతం సినిమాలు తగ్గడంతో ఈ అమ్మడు ఇలా ప్రత్యేక సాంగ్స్‌పై దృష్టిపెట్టినట్లు టాక్!