Others

మరోసారి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం దక్షిణాదిలో హర్రర్ చిత్రాల హవా ఇంకా కొనసాగుతూనే వుంది. ఇప్పటికే ఈ తరహా సినిమాలు తెరకెక్కి అటు ప్రేక్షకుల చేత, ఇటు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు హీరోయిన్లు హర్రర్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తెలుగు భామ అంజలి మరోసారి ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైంది. ఇదివరకే గీతాంజలి, బెలూన్, చిత్రాంగద వంటి హర్రర్ చిత్రాల్లో నటించిన అంజలి, తాజాగా మరో సినిమాలో నటిస్తోంది. 3డి హర్రర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజు విశ్వనాథ్ దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి లీసా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త తరహా అనుభూతి ఇచ్చేలా ఉంటుందని దర్శకుడు చెబుతున్నారు. మరి 3డిలో అంజలి ఎలా భయపెడుతుందో చూడాలి.