Others

మహానటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు ప్రేక్షకుల మనసులను, హృదయాలను తన నటనతో ఆకట్టుకున్న నటి సావిత్రి. ఆప్యాయతతో కూడిన ఆహ్లాదమైన చిరునవ్వు ఆమె సొంతం. వాత్సల్యంతో నిండిన అనురాగ పూర్వకమైన కల్మషంలేని పలకరింపు ఆమె సహజ గుణం. కేవలం ముఖ కవళికల ఆధారంగా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. కంటి చూపుతో కోటి భావాలను పలికించే మహానటి సావిత్రి జీవిత చరిత్రను కళ్ళకు కట్టినట్టు, ఎప్పుడూ మనసులో నిలిచిపోయేట్టు దర్శకుడు నాగ్ అశ్విన్ మలిచిన తీరు అద్భుతం. అందుకే సినీ లోకం ‘మహానటి’కి బ్రహ్మరథం పడుతున్నారు. సావిత్రి గురించి మనకు తెలియని ఎన్నో విషయాలను ఈ చిత్రం ద్వారా తెలియజేశారు. ఆమె జీవితంలోని వివిధ కోణాలను అందంగా ఆవిష్కరించారు. సినిమా చూసిన ప్రతిఒక్కరూ కీర్తిసురేష్ నటన గురించి మాట్లాడుకోవడం విశేషం. ఈ చిత్రంలో కీర్తిసురేష్ నటన మహాద్భుతం. ఆమె సావిత్రి పాత్రలో లీనమై జీవించారని చెప్పవచ్చు. ఆమె అసమాన అభినయానికి ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు. కీలక పాత్రలో మధుర వాణిగా నటించిన సమంత వృత్తికి, కుటుంబ బంధాలకు, ప్రేమకు మధ్య సంఘర్షణకు లోనయ్యే యువతిగా పరిణతితో కూడిన నటనను కనబరచి శభాష్ అనిపించుకుంది. మిగతా అన్ని పాత్రలను సందర్భోచితంగా వాడుకుంటూ, సినిమాను నడిపించిన తీరు దర్శకుడిలోని ప్రతిభను ఎత్తి చూపుతుంది. దర్శకుడు ఎంతో శ్రమించి అందించిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో నూటికి నూరుశాతం విజయాన్ని సొంతం చేసుకుంది. నేపథ్య సంగీతం, ఫొటోగ్రఫీ ప్రతిభ అద్భుతం. చాలా రిస్క్‌చేసి ఓ మహానటి జీవితాన్ని నేటి తరానికి పరిచయం చేసిన నిర్మాతలు అభినందనీయులు. ఈ చిత్రం తెలుగు చలనచిత్ర రంగంలో అసలు సిసలు ఆణిముత్యం.

-కాయల నాగేంద్ర, హైదరాబాద్