ఆంధ్ర గాథాలహరి

అది, అదిలే -13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
కరిమరి అఆలగజ్జిరజల ఆసణిపడినపడిరవో ఏసో
పఇణో ధణురవకంఖరి రోమంచ కిం ముహావహసి (మకరందుడు)
సంస్కృత ఛాయ
బంది! అకాల గర్జన శీల జలదాశని పతనప్రతిరవః ఏషః
పత్యుః ధ నూరవ కాంక్షణశీలే రోమాం చం కిం ముధావహసి!
తెలుగు
6.అది, అది కాదు
తే.గీ అమ్మహారవమో! బంది! అతని వింటి
మ్రోతయేకాదు, పులకించి పోకు మీవు
గగనసీమా వినిర్గతమగు, అకాల
భయద మేఘ గర్జనకది ప్రతిరవమ్ము
- అది తన పతి ధనుష్ట్రంకారమేనని ఆనందపడుతూన్న బందీ ఐన వనితతో దొంగల నాయకుడు ‘‘అది నీ మగని వింటి మ్రోత అనుకొని పొంగిపోతూ పులకించిపోతున్నావేమో! అది కానే కదా. అది కాలంగాని కాలంలో జరిగే మేఘ గర్జనకు ప్రతిధ్వని మాత్రమే! మిమ్మల్ని మా బారినుండి ఎవ్వరూ రక్షించలేరు! అని మరింత భయపెట్టాడు. కాని ఆమె ఎంతకీ భయపడకుండా ఆ దొంగతో ఇలా చెబుతోంది. నీవెంత వీరుడివైనా సరే నీతి నిజాయతీలున్న నా మగనికి భయపడాల్సిందే. అది నా మగని వింటి శబ్దమే. నీవు అబద్ధాలతో కాపురం చేసేవాడివి కనుక నీకు నిజం కళ్లెదుట కనిపించినా అది అబద్దంగా కనిపిస్తుంది.
కాని నిజమేదో అబద్ధమేతో తెలుసుకొనే బుద్ధి ఉంది. పైగా నిర్భయుడైనా నా మగని నీడలో బతుకుతున్న దానిని. నేను వెలుగులో ఉండే దాన్ని. నీవేమో చీకటిలో తిరిగేవాడివి. కనుక నీకు మేఘ గర్షనకు నా మగని దనుష్ట్రంకారమేదో నీకు తెలియకున్నది. ఎవరైనా సరే అబద్ధాలతో నీతి లేని పనులు చేసేవారు ఎప్పటికైనా భయపడి తీరాల్సిందే. సత్యం అందిరకీ వెలుగు నిస్తుంది. ఆ వెలుగులో నేనున్నాను. నీవు చీకటిలో ఉన్నావు. కనుక నీవే అర్థం ఛేసుకో అని నిర్భయంగా చెప్పింది.
*
- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949