Others

నమ్మకం ఉంటే తప్ప చిన్న సినిమా చేయను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా... ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మారుతి దర్శకత్వంలో నాగవంశీ.ఎస్, పి.డి.వి.ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఈనెల 13న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి చెప్పిన విశేషాలు...
విభిన్నమైన ప్రయత్నం...
నేను తీసిన సినిమాలన్నింటిలో డిఫరెంట్ సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. రీరికార్డింగ్ సహా సినిమా చూశాను. చాలా శాటిస్‌ఫాక్షన్‌గా అనిపించింది. కుటుంబం అంతా కలిసి చూసే ఓ ఎంటర్‌టైనర్ ఇది. నటుడు ఎదిగే కొద్ది పరిణితి వస్తుంది. అలాంటి ఓ మెచ్యూరిటీ నాగచైతన్యలో చూశాను. కొన్ని సీన్స్‌లో తన నటనను చూస్తే నాగార్జుననే చూసినట్లు అనిపించింది.
అత్త, అల్లుడు మధ్య...
‘అత్త, అల్లుడు మధ్య జరిగే ఛాలెంజ్ తరహా కథ ఇది కాదు. కంప్లీట్‌గా డిఫరెంట్ మూవీ. ఓ సాధారణ కుర్రాడు. శైలజారెడ్డికి ఎలా అల్లుడయ్యాడనేదే కథ. అంతే తప్ప అల్లుడు అయిన తర్వాత కథ ఇది కాదు. సాధారణంగా అత్త.. ఆమె కూతురితో ఉండే ఇగోయిస్టిక్ సమస్యలే ఈ సినిమా కథ.
ఇగోయిస్ట్‌ల కథ...
ఇగో అందరిలో ఉంటుంది. మనతోపాటు మనలోని ఇగో పెరుగుతుంటుంది. మనకు కావాల్సినవన్నీ దొరికితే ఎదుటి వ్యక్తి మాట వినం. అప్పుడు మనలో అహం వచ్చేస్తుంది. ఫెయిల్యూర్ వస్తే తట్టుకోలేం. సమస్యలు అక్కడే మొదలవుతాయి. శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణగారు చాలా చక్కగా యాప్ట్ అయ్యారు. సాధారణంగా అత్త అల్లుడు మధ్య జరిగే కథ. అత్త విలన్‌గా ఉండటాన్ని ఎప్పటినుండో చూస్తున్నాం. కానీ ఇది వాటన్నింటికీ భిన్నంగా ఉంటుంది. రమ్యకృష్ణగారు ఇందులో విలన్‌గా కనపడరు. తెలుగు ప్రేక్షకులు సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, చెన్నకేశవరెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాలను చూసి ఓ పవర్‌ఫుర్ హిట్స్ చేశారు. మన సినిమా టైటిల్‌లో రెడ్డి అనే పదం యాడ్ చేయడం వెనుక ఓ పవర్‌ఫుల్ నెస్ వస్తుందనే ఆలోచనే తప్ప మరోటి లేదు. సినిమా క్లాస్‌గా ఉంటుంది.
అందుకే ఆలస్యం...
వరదల కారణంగానే సినిమా రిలీజ్ ఆలస్యమైంది. కేరళకు వెళ్లాను. వెళ్లిన రోజు నుండే వరదలు. తగ్గుతుందేమో అని వెయిట్ చేశాను. తగ్గలేదు... సరికదా! పెరుగుతూ వచ్చింది. గోపీసుందర్ బంధువులు కూడా వరదల్లో చిక్కుకోవడంతో తను టెన్షన్ పడుతుండేవాడు. అలాంటి సమయంలో తనను ఇబ్బంది పెట్టడం సరికాదనిపించింది. అందుకే రెండు వారాలు గ్యాప్ తీసుకుని వస్తున్నాం. ఇందులో అను ఇమ్మాన్యుయేల్ బయట ఎలా ఉంటుందో... సినిమాలో కూడా అలాగే ఉంటుంది.
డిజార్డర్ సినిమాలు...
డిజార్డర్ సినిమాలు చేయాలంటే నాకు చాలా ఇష్టం. ప్రస్తుతం కాస్త గ్యాప్ ఇచ్చాను. చాలా డిజార్డర్స్ ఉన్నాయి. వాటిపై సినిమాలు తీయాలి. నేను ఒక కథ చెప్పినప్పుడు మరొకరు బాగా డైరెక్ట్ చేస్తే అదొక రకం. అదే నేను కథను మరొకరితో తీయించాలనుకున్నప్పుడు అదొక రకం. వాళ్లు తీయొచ్చు... తీయలేకపోవచ్చు. వేరే వాళ్లు డైరెక్ట్ చేస్తున్నప్పుడు వారితో మనం కొంత దూరం మాత్రమే ట్రావెల్ చేయగలుగుతాం. అంతకుమించి చేయలేం.
తదుపరి చిత్రాలు...
గీతాఆర్ట్స్, యువి క్రియేషన్స్ కలిసి చేస్తున్న సినిమా.. మహేష్ సిస్టర్ మంజులగారి నిర్మాణంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనే ఆసక్తి ఉంది. అల్లరి నరేశ్ సినిమా కూడా ఉంటుంది.

- శ్రీ