Others

పద్యంతోనే ప్రత్యుత్తరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంస్కృత, తెలుగు భాషలపై సీ.పీ. బ్రౌన్‌కు మక్కువ ఎక్కువ. దీంతో ఒకపక్క సాహితీ సేవతో పాటు మరోపక్క సమాజ శ్రేయస్సు కోసం అహరహం శ్రమించారు. బ్రౌన్ రచనలపై అధ్యయనాలు, పరిశోధనలు జరిగాయంటే తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన కృషి ఏమిటో అర్థమవుతుంది. విద్యావ్యాప్తికి, ఉచిత భోజన వసతికి అయ్యే ఖర్చును సొంతంగా భరించేవారు. తన జీతాన్ని, జీవితాన్ని భాషా సాహిత్యాల కోసం ఖర్చు చేసిన బ్రౌన్ జీవితంలో తెలుగు నేలపై ఎన్నో అనుభవాలు ఉన్నాయ. వాటిలో మచ్చుకు ఒకటి -
బ్రౌన్ కలెక్టరుగా వ్యవహరిస్తున్న సమయంలో ఓ రైతు తన సమస్య పరిష్కారానికి బ్రౌన్‌కు అర్జీ పెట్టుకున్నాడు. తన సమస్య ఏమిటో వివరంగా రాసి పరిష్కరించాలంటూ పోతన భాగవతంలోని గజేంద్రమోక్షంలోని ఈ కింది పద్యంతో తన దీన స్థితిని వివరిస్తూ ఇలా వేడుకున్నాడు.
లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చెదనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప నితఃపరంబెఱుగ మన్నింపందగున్ దీనునిన్
రావే యాశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా
ఈ విజ్ఞాపనను అందుకున్న సీపీ బ్రౌన్ - పోతన భాగవతంలో పరీక్షిత్తు మహారాజుకు శుకయోగి చేసిన బోధనలోని ఈ కింది పద్యాన్ని ఉటంకిస్తూ ప్రత్యుత్తరం పంపారు. దీంతో ఆ రైతు సమస్యను కూడా తక్షణం పరిష్కరించారు.
ఏను మృతుండ నౌదునని యంత భయంబు మనంబులోపలన్
మానుము; సంభవంబు గల మానవ కోట్లకు జావు నిత్యవౌ;
గాన హరిం దలంపు; మిక గల్గదు జన్మము నీకు ధాత్రిపై;
మానవనాథ! పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్.
నాటి కాలంలో పామరుల నోట పోతన పద్యాలు ఎలా నడయాడేవో ఈ రైతు ఉదంతమే తార్కాణం. అంతేకాదు, ఆ ప్రాంతానికి కలెక్టరుగా వ్యవహరిస్తున్న విదేశీయుడైన కలెక్టరు బ్రౌన్ సైతం అంతే పాండిత్యంతో ప్రత్యుత్తరం పంపి తీవ్ర వేదనలో ఉన్న ఆ రైతుకు ధైర్యాన్ని, జీవితం మీద ఆశను కలిగించేందుకు ప్రయత్నించడం పద్యానికి గర్వకారణం కదూ.
*