Others

ఖుషీ ఖుషీగా...(నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇద్దరుమిత్రులు చిత్రంలో నాయికా నాయకులు ఖుషి ఖుషీగా నవ్వుతూ పాట పాడుతూ చివరిలో ‘హుషారుగా ఉందాములే.. హమేషా మజాగా’ అని ముగిస్తారు. మేనాలోన ప్రియునిజేర వెళ్లింది నా చెలి మీనా/ నింగిదాటి ఆనంద సాగరం పొంగిపొరలె నాలోన అంటాడు ప్రియుడు. ఓహో చెలియా నీవుకూడా ఓ పెళ్లిపల్లకీ చూసుకో/ హాయిగొలుపు సన్నాయి పాటలో వలపుబాటలే వేసుకో అంటుంది ఆమె.
‘ఆకాశంలో ఇంద్రధనస్సుపై ఆడుకుందమా నేడే/ నీలి నీలి మేఘాల రథముపై తేలిపోదమీనాడే/.. చంద్రుడు నేనై నీవు వెనె్నలై కలిసిపోదమా హాయిగా/ నేను వీణనై నీవు నాదమై ఏకవౌదమా తీయగా.. అంటూ సాగుతుంది.
ఇలా ఆహ్లాదకరమైన వర్ణనలు, గడసరి సమాధానాలతో సాగుతుందీ పాట. ఆకాశంలో ఇంద్రధనస్సుపై ఆడుకుందమా నేడే/ నీలి నీలి మేఘాల రథముపై తేలిపోదమీనాడే అన్న చరణం ఎంతో కవితాత్మకంగా రాశాడు రచయత. పాట మొత్తం ఓ రస గుళిక. ఇద్దరు మిత్రులు చిత్రం కోసం ఈ రస గుళికను అందించింది దాశరథి. చిన్ని చిన్ని కవితాత్మక పదాలకు అద్భుతమైన బాణీ కట్టింది మాత్రం స్వరాల రారాజు రాజేశ్వరరావు. సాలూరి పాటలలో ఎక్కువ శాతం శాక్సాఫోన్, గిటార్లు ఉపయోగిస్తుంటారు. ఈ పాటలోనూ ఆయా వాద్యాల శబ్దం సంస్కారవంతంగా వినిపిస్తుంది. నిజానికి తెలుగు చిత్రసీమలో ఈ వాద్యాలలో నాందీ వాచకం ఆయనదే. సమకాలీన సంగీత యుగం నుండి ఆధునిక యుగానికి సంగీతాన్ని మళ్లించిన సారథి సాలూరి. దాశరథి తెలంగాణ కవి కనుక పాటలలో హిందీ, ఉర్దూ మాటలను ఉపయోగించారు. ‘ఖుషీ, హుషారు, నిషా, హమేషా, మేనా’లాంటి పదాలు వాడి హుషారు తెచ్చారు పాటకు. ఈ పాటేకాక చిత్రంలోని పాటలన్నీ హిట్టే. ఇప్పటికీ ఈ పాట వినిపిస్తుంటే ఖుషీఖుషీగానే ఉంటుంది. హుషారు గొలుపుతుంది.

-ఎంబీఎస్ రాఘవ, తెనాలి