Others
భావచిత్రాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 14 May 2019
- దాస్యం సేనాధిపతి, 9440525544
నా మనోఫలకంపై
కదలాడే...
భావచిత్రాలు
పేదవాని గుండెచప్పుళ్ళను
పదిమందికి వినిపించాలని...
అక్షరాలను పెనవేసుకుని...
శే్వతపత్రంతో జతకడతాయ!
అక్రమార్కుల భరతం పట్టడానికి...
ఆయుధాలై ఉరకలు వేస్తాయ!
కార్మికుల స్వేదాన్ని
వీరతిలకంగా అద్దుకుని...
శ్రమైక సౌందర్యాన్ని
ఆవిష్కరించడానికి...
పరుగులు తీస్తాయ!
నేతన్నల తలరాతలు
మార్చడానికి
పాలకులను మేల్కొలుపుతాయ!
రైతన్నల జీవితాల్లో
వెలుగులు నింపడానికి
ఉవ్విళ్లూరుతాయ!
కల్లా కపటం ఎరుగని
బాలల బోసినవ్వుల్ని
పూలమాలలుగా కూర్చి
పరవశింపజేస్తాయ!
రమణీయతకు అద్దం పట్టేలా
ప్రకృతి కాంతకు
అదనపు అక్షర సొబగులద్దుతాయ!