Others

కాలం సీతాకోక..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం
ప్రవహించే క్షణాలన్నీ
చిగురు బంధంగా అనుబంధమైంది
సీతాకోక చిలుక తోటలో
దీపమై వెలిగింది
చీకటి హృదయంలో
నిశ్శబ్దంగా తేదీల్లో చిక్కుకున్న కాలం
గాయాలకు అనుభూతుల వెల్లువైంది
మళ్లీ మళ్లీ చినుకులా
మనసు వెనుక పరిమళించే పువ్వులా
కొత్త వెలుగులు
కొద్ది రోజులకు ముందు
సీతాకోక ఓ గొంగళీపురుగు
నేడు అందాల హరివిల్లు తోటలో
ప్రతీ రోజూ దీపావళి క్రాంతి
చెట్టు గుండెలను
వెలిగించి మరీ వెళుతోంది
అనుభూతుల్ని తారాజువ్వలా ఆకాశంలో చిమ్మి
పరవశంతో గాలిపటంలా
పరుగు పెడుతోంది వౌనంగా సీతాకోక
చిగురు వెలుగుల్లో దివ్వెగా మారిపోయంది
చిరునవ్వుతో కాలాన్ని నడిపిస్తోంది
గత జీవిత స్పర్శ లేకుండా
పువ్వులన్నీ గాలికి
సువాసనా దుప్పటి కప్పాయ
మంచువేళలో ఉదయ తుషారం
మనసుకు చేరువయ్యంది
మనసు మరుమల్లెల తోటే అయ్యంది

- నల్లా నరసింహమూర్తి, 9247577501