Others

చైతన్య క్షణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత
ఒక ఆదిమ శబ్దం
బహు పాతది
నిషాదుడు ధర్మం తప్పినప్పుడు
శోకం శ్లోకమయ్యంది
తన మాటకు తానే విస్మితుడైతే
ఆ కవికి అది సార్థకత

శబ్దార్థాలు సరే
భావార్థమే కష్టం.
సంగీతాన్ని కన్నది వెదురు కాదు
దానిలో నిండిన ఊపిరి.

రాతి మీద పువ్వులు
నీటిలో పూచినవి కాదు
రక్తాన్ని ధారబోసి చెక్కినవి
వాటినిండా చైతన్య క్షణాలు
ఇంత పెద్ద ఆకాశంలో
ఒకే ఒక మబ్బుతునక
భయం వెయ్యదా అంటే
దాని యాత్రా వైశాల్యం ముందు
గగనం చిన్నదవ్వటమే కవిత్వం

ఎక్కడి సంవేదనో ఇది!
కాలంలోని మార్పును పసికట్టింది.
అగ్నిలా కాల్చింది గాని
వెలుగును కూడా వెదజల్లింది

చీకటిని తగులబెట్టిన మంటలాగ
ఉదయస్తున్నాడు సూర్యుడు
ఆవాహనకు కూర్చున్నాను
కవిత్వం కూడా ఒక యోగమే
ముక్కు మూసుకోవడం కాదు
హృదయాన్ని తెరవడం దాని నైజం.

- డా. ఎన్. గోపి