Others

ఒంటరితనంలోకి ప్రవహిస్తూ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుఃఖపు మూట చిట్లి
ఆనందం తెరలు తెరలుగా
గుండె శిఖరం మీద వాలుతుందేమోనని
కనుచూపుల్ని భవిష్యత్ కాలానికి
తగిలించేసి ఎదురుచూస్తున్నా
విషాదం గరళమై ఘనీభవిస్తూ
కనుపాపల మధ్య వేలాడుతోంది
బతుకు నిత్య కన్నీటి దృశ్యమై
అష్టకష్టాల కాన్వాసుపై
వెలసిన రంగులద్దుకుంటోంది
వేదనలు ఆవేదనలు
జన్మజన్మల బంధమన్నట్లు
మనోఫలకంపై
వ్యథా భరిత అక్షరాలుగా
ఆయుష్షు పోసుకుంటున్నాయి
నేలపైనే్న హృద పొరల్ని పరిచేస్తూ
ఆకాశానికి ఆవల ఏముందో
చూడలేని హీన దుస్థితి
కుంచించుకుపోవడమే
దైనందిన జీవనమవుతుంటే-
నిర్వేదమై నిర్వీర్యమై నిర్జీవమై
బతుకు వెతలతో
భారంగా బ్రతుకీడుస్తూ...
మీ ఎద గదులకు దూరంగా
నేను నేనుగా... నాకు నేనుగా
క్షణ క్షణం
ఒంటరితనంలోకి ప్రవహిస్తూ...

- అంజలి ఎనుగంటి