Others

ఈ దేశం విచిత్రమైంది -

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకడు
మైళ్ళ పొడుగునా
భుజం మీదో
సైకిల్ మీదో
తల్లి శవాన్నో, తండ్రి శవాన్నో
మోసుకెళ్తాడు

మరొకడు
చేతులూ కాళ్ళూ విరిచి గోనెసంచిలో
మూటకట్టుకొని పరుగెడతాడు

బీదతనం
వెక్కివెక్కి ఏడుస్తుంది
నలుగురు మోయాల్సిన శవం
గౌరవంగా అంతిమయాత్ర
చేయాల్సిన శవం
నిస్సహాయంగా నిట్టూరుస్తుంది
శవం కదా!
ఏమీ మాట్లాడదు
మనుషులు శవాలుగా మారుతున్న వైనం

మరికొందరు
ఈ నేలకు విమర్శిస్తారు
బాంబులను పేలుస్తారు
వాళ్ళ ఇంట్లో బాంబులు పేలతాయ
తాగి చంపుతారు
తాగి చస్తారు
మోసుకెళ్లడానికి
లెక్కలేనంత మందీ మార్బలం

వాళ్ళకి
అధికార లాంఛనాలు ఎదురెల్తాయ
తుపాకులు పేలతాయ జనం గుండెల్లో
గంధపు చెక్కలు
దుర్వాసనలని వెదజల్లుతాయ

భయమో విభ్రాంతో
ఎవరూ
కళ్ళు తెరవరు
నోరు మెదపరు

ఇదీ నా దేశ
ఓట్ల స్వామ్యం

- జింబో, 9440483001